Lowest price this festive season! Code: FIRST10
Updated on 10 July 2023
మొదటిసారి తల్లి అవుతూ, మీరు మీ బిడ్డ కోసం ఎదురు చూడటం అన్నది మీ జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన సమయాలలో ఒకటి. మొదటి గర్భం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. మీలో రెండు చిన్న ప్రాణాలు పెరుగుతున్నప్పుడు అది ఇంకొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఉత్సాహంతో పాటు ఆందోళన కూడా మీలో ఉంటుంది. అది సాధారణమే! మీ ఆందోళనలను తగ్గించడానికి, మీరు ప్రసవం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏమి ఆశించాలనే దాని గురించి కొంత జ్ఞానాన్ని పొందడం మీరు చేయగలిగే ఉత్తమమైన పని.
మీరు కవలలతో గర్భవతిగా ఉన్నప్పుడు, కొన్ని తేడాలు పక్కన పెడితే, ఒక బిడ్డను మోయడం వంటి అనుభవమే ఉంటుంది. కవలల విషయానికి వస్తే పిండాల ఎదుగుదల భిన్నంగా ఉంటుంది. మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం ఇది. మొదటి కొన్ని వారాలు ముఖ్యమైనవి మరియు పిండం పెరుగుదల పట్టికను మెయింటేయిన్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి వారం పిండం పెరుగుదల అనే ఆలోచన వైపు మిమ్మల్ని తీసుకెళ్లనివ్వండి. ఇది మీ కవలల గర్భంతో మీరు ఎలా వ్యవహరించాలో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
మీకు శుభాకాంక్షలు! సాధారణంగా ఎగ్ ఇంప్లాంటేషన్ అయిన 4వ వారంలో మీరు మీ గర్భం యొక్క క్లినికల్ రిపోర్ట్ పొందుతారు. మీ శరీరంలో మీ హార్మోన్ స్థాయిలు మారడం ప్రారంభిస్తాయి. గర్భంలో ప్లాసెంటా ఏర్పడుతుంది. మీరు కవలలతో గర్భవతిగా ఉన్నప్పుడు, రెండు గుడ్ల చుట్టూ రెండు వేర్వేరు మావి ఏర్పడటం ప్రారంభమవుతుంది. 5 వారాలలో, మీరు మొదటి త్రైమాసికంలో పిండం పెరుగుదల సాధారణంగా ఉందా లేక నెమ్మదిగా ఉందా అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి పెరుగుదలను ట్రాక్ చేయడం ప్రారంభించవచ్చు. ఈ దశ 13 వారాల చివరి నాటికి ముగుస్తుంది. అప్పటికి మీ శిశువులు అన్ని అవయవాలతో అభివృద్ధి చెంది ఉంటారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: కవలలతో కూడిన ప్రెగ్నెన్సీని పొందడం ఎలా
మీ రెండవ త్రైమాసికంలో, మీ పొట్ట కనిపించడం ప్రారంభిస్తుంది. కవలలతో మీరు గర్భంతో ఉన్నప్పుడు, మీరు ఒక బిడ్డ కంటే కొంచెం పెద్ద పొట్టను ఆశించవచ్చు. మీ పిల్లలు త్వరగా కదులుతున్నారని మరియు కిక్స్ రావడం ప్రారంభం అవుతున్నాయని మీరు భావిస్తారు. మీ పిల్లలు చురుకుగా తయారవుతారు మరియు 17 వారాలకు బరువు పెరగడం ప్రారంభిస్తారు. ప్రతి అల్ట్రాసౌండ్ తర్వాత పిండం బరువు చార్ట్‌ను మెయింటేయిన్ చేయడానికి ఇది మంచి సమయం. ఈ కాలాన్ని ఆస్వాదించండి, ఎందుకంటే, మీరు 20 వారాల పిండం అభివృద్ధిలోకి ప్రవేశించే సమయానికి, మీ పిల్లలు మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వరు. 22 నుండి 27 వారాల వ్యవధిలో ప్రవేశించినప్పుడు, మీరు విషయాలను తేలికగా తీసుకోవాలి. చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి అయితే మీ దినచర్య తేలికపాటుగా ఉండేలా చూసుకోండి. మీ రెండు చిన్న బంగారు కొండలు మీ ఇంటిని బిజీగా ఉంచడానికి ముందు, చివరి కొన్ని వారాలు ఏ విషయం గురించి ఆతృతపడకుండా విశ్రాంతి తీసుకోకండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అనోమలి (2వ అల్ట్రాసౌండ్) స్కాన్ ఉద్దేశం ఏమిటి?
IUGR అనేది ఇంట్రా యుటెరిన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అని పిలువబడే అరుదైన పిండం పరిస్థితి. IUGR పిల్లలకు, మొదటి సంకేతం పిండం పెరుగుదల నెమ్మదిగా జరగడం. కవలల విషయానికి వస్తే, సాధారణంగా ఒక శిశువు మరొకదాని కంటే తక్కువగా పెరగటం. ఈ పరిస్థితి ఏర్పడటానికి నిర్దిష్ట కారణం లేదు, కానీ ఇది మావి (ప్లెసెంటా) అసాధారణతలు, తల్లిలో అధిక రక్తపోటు మరియు ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు.
• రెగ్యులర్ మరియు వీక్లీ అల్ట్రాసౌండ్లు
• పిండం బయోమెట్రీ చార్ట్‌తో ట్రాకింగ్
• అంచనా వేయబడిన పిండం బరువు చార్ట్‌తో పిండం పెరుగుదలను ట్రాక్ చేయడం
• డాక్టర్ సిఫార్సు చేసే ప్రత్యేక గర్భాశయ స్కాన్లు
ఈ సమాచారాన్ని మీకు తెలియజేసి మిమ్మల్ని ఆందోళనకు గురి చెయ్యడం మా ఉద్దేశం కాదు. కాకపోతే, IUGR గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే దానిని నివారించగల పరిస్థితి ఉంటే, అప్పుడు మీకు సాయం చేయగలిగేది కేవలం దాని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం మాత్రమే. ఈ రోజు నిర్దిష్ట IUGR చికిత్స అందుబాటులో లేనప్పటికీ, ఈ కండిషన్‌కు నియోనాటల్-ఫెటల్ స్పెషలిస్ట్ చికిత్స చేయవచ్చు. మీరు పిండం ఎదుగుదలను ట్రాక్ చేస్తుంటే, ఏదైనా సరిగ్గా లేకుంటే మీరు అర్థం చేసుకోగలరు మరియు తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోగలరు.
Twin Pregnancy in telugu, 8th week of twin pregnancy in telugu, twin pregnancy symptoms in telugu, precautions to take in twin pregnancy in telugu.
Yes
No
Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips
5 Steps to a Healthy Lifestyle: The Blueprint for Your Wellness Journey
Chandraprabha Vati: How This Potent Ayurvedic Formulation Can Boost Your Health
Trichomoniasis: Meaning, Symptoms, Causes and Risks
Gallstones in Pregnancy: Symptoms, Complications & Treatment
Fertility Massage: A Holistic Approach to Boosting Fertility Your Chances of Conception
Baby Vomiting After Feeding: Understanding the Causes and Solutions for Upset Stomach
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |