Lowest price this festive season! Code: FIRST10
Scans & Tests
31 July 2023 న నవీకరించబడింది
మీ రెగ్యులర్ పీరియడ్ మిస్ అయినట్లయితే, బహుశా మీరు గర్భవతి అయి ఉండవచ్చు. మీరు గర్భం ధరించిన ఒక నెల తరువాత, ప్రెగ్నెన్సీని నిర్ధారించడానికి హోం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మీకు సహాయపడుతుంది. వాస్తవానికి కిట్ పై పాజిటివ్ మార్క్, ప్రెగ్నెన్సీ టైంలో మీ శరీరం ఉత్పత్తి చేసే hCG స్థాయిని సూచిస్తుంది. గర్భం ధరించిన పది రోజుల తర్వాత ఈ స్థాయి చాలా ముఖ్యమైనది. నిజానికి ఈ దశ ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఉత్తేజకరమైన దశ. ప్రెగ్నెన్సీ మీ శరీరంలో అనేక మార్పులను తెస్తుంది. మీరు ఊహించని పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. చాలా మంది గర్భిణీలు సాధారణంగా వారి గర్భం యొక్క నాల్గవ వారంలో అసాధారణ స్రావం(డిశ్చార్జ్)ను చూస్తారు. 4 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు స్రావం సాధారణం. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ చెడు వాసన లేదా దురదను కలిగి ఉంటే మీరు మీ డాక్టర్ని సంప్రదించాలి. దీంతో మీరు మీ పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అనేక హెల్త్ కండీషన్లను నివారించవచ్చు.
అందరు తల్లులు ఒకే రకమైన లక్షణాలను ఎదుర్కోరు. ఒక్కొక్కరి అనుభవాలు వేరువేరుగా ఉండవచ్చు. వాస్తవానికి మీ మొదటి ప్రెగ్నెన్సీ అనుభవం మీ రెండవ గర్భధారణ అనుభవంతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. గర్భిణీ స్త్రీలు తమ నాలుగు వారాల ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా అనుభవించే కొన్ని అత్యంత సాధారణ లక్షణాలు మీ సౌలభ్యం కోసం:
మీ బిడ్డ అభివృద్ధి చెందడానికి శరీరం చాలా స్థలాన్ని తయారు చేస్తుంది కాబట్టి మీరు మీ దిగువ పొత్తికడుపు ప్రాంతంలో ఉబ్బరాన్ని అనుభవించవచ్చు. అలా కాకుండా మీ గర్భం యొక్క లైనింగ్ కూడా మందంగా మారుతుంది. తద్వారా శిశువును స్వీకరించడానికి సిద్ధం అవుతుంది.
మీ ప్రెగ్నెన్సీ నాల్గవ వారంలో, 4 వారాల గర్భధారణ స్రావంతో పాటు తేలికపాటి రక్తస్రావాన్ని మీరు అనుభవించవచ్చు. ఇంప్లాంటేషన్ రక్తస్రావం రెండు రోజుల పాటు ఉంటుందని మీరు ఆశించవచ్చు. అయినప్పటికీ రక్తస్రావం ఎక్కువ కాలం కొనసాగితే, మీ డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాల్సిన సమయం అది కావచ్చు.
ఈ లక్షణాలు సాధారణంగా మీ ప్రెగ్నెన్సీ మొదటి నెలలో చాలా సాధారణం. నిజానికి మీ హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గుల కారణంగా మానసికస్థితి సాధారణంగా సంభవిస్తుంది. ఇది చివరికి ఊహించని భావోద్వేగ మార్పులకు దారితీస్తుంది. మీ మొదటి మరియు మూడవ ట్రిమ్స్టర్లో మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని విశ్రాంతి వ్యాయామాల(రిలాక్సింగ్ ఎక్సర్ సైజులు)తో పాటు యోగా మీ మూడ్ స్వింగ్స్ (మానసిక స్థితి)ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
ప్రెగ్నెన్సీ మొదటి నెలలో పాల గ్రంథులు అభివృద్ధి చెందుతాయి కనుక మీరు రొమ్ముల సున్నితత్వాన్ని అనుభవించవచ్చు. అలాగే మీ నవజాత శిశువుకు పోషణ అందించడం కొరకు మీ రొమ్ము పరిమాణం కూడా పెరుగుతుంది.
మీ శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు అలసట లేదా తేలికపాటి తలనొప్పిని అనుభవించవచ్చు. మీరు విటమిన్ లోపాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత సరైన నిద్ర పోవడం ఈ సమస్యలను చాలావరకు తగ్గించడానికి మీకు సహాయపడుతుంది.
మీ నాలుగు వారాల ప్రెగ్నెన్సీ సమయంలో మీరు యోని స్రావాలను అనుభవించవచ్చు. వాస్తవానికి తెలుపు స్రావం, స్పష్టమైన కాంతి రంగులో ఉండవచ్చు. ఇది మామూలుగా అయితే సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. అయినా మీరు ఏదైనా బాధ లేదా నొప్పిని అనుభవిస్తే, వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలి.
మీ ప్రెగ్నెన్సీ మొదటి నెలలో మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఈ అంశాలలో కొన్నింటిని అమలు చేయడం ద్వారా మీరు మీ గర్భధారణ దశను మరింత చిరస్మరణీయంగా మార్చుకోవచ్చు. ఈ అంశాలు మీకోసం:
1. కొత్త డైట్ ప్రారంభించడం గురించి ఆలోచించండి. రక్తహీనతతో సహా అనేక హెల్త్ కండీషన్లను నివారించడానికి మీరు బచ్చలికూర, జున్నును జోడించడాన్ని ప్రారంభించవచ్చు.
2. మద్యం, ధూమపానం లాంటి అలవాట్లు మీ బిడ్డ ఎదుగుదల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మీకు ఆ అలవాట్లు ఉంటే వాటిని మానెయ్యాల్సి ఉంటుంది. అలా కాకుండా అటువంటి అలవాట్లను కొనసాగించడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాలకు కూడా దారితీసే అవకాశం ఉంది.
3. ధూమపానం తరహా ఇతర పొగతాగే అలవాట్లను కూడా మానుకోండి
4. సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది.
5. తేలికపాటి వ్యాయామాలను ప్రాక్టీస్ చేయడాన్ని ప్రారంభించండి. మీ శరీరానికి అలాగే మీ ప్రెగ్నెన్సీ నెలకి తగినవిధంగా ఎలాంటి వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలో డాక్టర్ని సంప్రదించవచ్చు. తేలికపాటి దినచర్యతో ప్రారంభించి, చివరికి మరింత సరళమైన సౌకర్యవంతమైన దినచర్యలకు వెళ్లడం మంచిది. వాకింగ్ మరియు స్ట్రెచింగ్ వంటి అనేక వ్యాయామాలు ప్రసవ సమయంలో చాలా సహాయపడతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: త్రైమాసికాల(ట్రైమిస్టర్) వారీగా గర్భధారణ వ్యాయామం
6. ప్రతిరోజూ మీ విటమిన్ సప్లిమెంట్లను తీసుకునేలా చూసుకోండి.
7. ప్రెగ్నెన్సీకి సంబంధించిన అంశాలను పరిశోధించడానికి ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించండి. మీరు మరింత సిద్ధంగా ఉండటానికి కొన్ని ప్రెగ్నెన్సీ మ్యాగజైన్లను కూడా చూడవచ్చు.
8. మీ బిడ్డ మొదటి కిక్ లేదా కదలికలు వంటి ప్రత్యేక క్షణాలను గుర్తుంచుకోవడం కోసం మీ క్యాలెండర్‌పై తేదీలను మార్క్ చేయండి.
9. మీ ప్రెగ్నెన్సీతో సంబంధం ఉన్న పిక్చర్ బుక్ తయారు చేయడం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సరదాగా మారుతుంది. మీరు ఒక పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ గర్భధారణ దశలో మీరు తీసిన ఫోటోలను అతికించవచ్చు. మీ బంప్ యొక్క వీక్లీ ఫోటోలను చూపించే పిక్చర్ బుక్ చాలా ఆసక్తికరంగా మారుతుంది.
మీరు మీ వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు, మీరు కొన్ని ప్రశ్నలు అడగడంతో పాటుగా అన్ని అంశాలను క్లియర్ చేసుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ కుటుంబ చరిత్ర లేదా జాతిని బట్టి మీరు చేసుకోవాల్సిన మెడికల్ టెస్టుల గురించి మీ డాక్టర్ని అడగండి. ఒకవేళ మీరు ఇప్పటికే ఔషధాలను తీసుకుంటున్నట్లయితే, ప్రెగ్నెన్సీ సమయంలో ఆ ఔషధాల ప్రభావాన్ని మీరు అడగాలి. మీ డాక్టర్ ఆ ఔషధాలను కొనసాగించడానికి రెకమండ్ చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. మీ తదుపరి మెడికల్ టెస్టుల షెడ్యూల్‌కు సంబంధించి కూడా మీరు మీ డాక్టర్ని సంప్రదించవచ్చు.
మీ నాలుగో వారంలో భవిష్యత్తు అపాయింట్‌మెంట్‌లు, టెస్టుల గురించి మీ డాక్టర్‌తో మాట్లాడటానికి ప్రయత్నించండి. ధృవీకరణ కోసం మీరు మీ సన్నిహితులతో సమాచారాన్ని పంచుకోండి. మీ చెక్ లిస్ట్‌లో మీ ఆహార మార్పులు, వ్యాయామ ప్రణాళికలు (ఎక్సర్సైజ్ ప్లాన్లు), జీవనశైలిలో మార్పులు అదేవిధంగా అమలు ప్రక్రియ కూడా ఉండాలి.
Fourth Week of Pregnancy in telugu, Symptoms of fourth week pregnancy in telugu, Best foods to eat in fourth week of pregnancy in telugu, Precautions for fourth week of pregnancy in telugu, Doctor check up for fourth week of pregnancy in telugu.
Yes
No
Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips
ప్రెగ్నెన్సీ గ్లో నిజంగానే ఉంటుందా? (Is Pregnancy Glow a Real Thing in Telugu?)
అబార్షన్ నుండి మానసికంగా కోలుకోవడంలో మీకు సహాయపడే 8 దశలు (8 Steps to Help You Recover Emotionally from the Loss of Your Baby in Telugu)
మీ నవజాత శిశువును వారి తోబుట్టువులకు పరిచయం చేయడం (Introducing Your New Born to Older Siblings in Telugu)
పెంపకం (పేరెంటింగ్) అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది? ( How Parenting Affects Child's Growth in Telugu?)
మీ బిడ్డ నిద్రపోవడానికి సహాయపడే మూడు అత్యుత్తమ టిప్స్ (Top Three Tips to Help Your Baby Sleep in Telugu?)
మీ శిశువు పగటిపూట కునుకు తీయడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి? (What to Do If Your Child Refuses to Take a Nap in Telugu?)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |