hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • గర్భధారణలో మఖాన (తామర గింజలు): మీరు తెలుసుకోవాల్సిన విషయాలు arrow

In this Article

    గర్భధారణలో మఖాన (తామర గింజలు): మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

    Pregnancy Best Foods

    గర్భధారణలో మఖాన (తామర గింజలు): మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భవతులు తమ ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే వారు తినే ఆహారం కేవలం వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విటమిన్లు, మరియు మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని గర్భధారణ సమయంలో తీసుకోవాలి. అటువంటి ఆహారంలో మఖాన లేదా తామరగింజలు కూడా ఉంటాయి. ఇవి గర్భవతుల ఆహార జాబితాలో తప్పకుండా ఉండాలి. గర్భధారణ సమయంలో మఖాన (తామర గింజలు) తినడం ఎంతో మంచిది ఎందుకంటే ఇందులో అధిక పోషక విలువలు ఉంటాయి. పిండం ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది.

    అసలు మఖాన (తామరగింజలు) అంటే ఏమిటి?

    మఖాన (తామర గింజలు) ను అనేక పేర్లతో పిలుస్తారు. తామర గింజ లేదా ఫాక్స్ నట్ అనే పేర్లు దీనికి ఉన్నాయి. చాలా రకాల ఆఫ్రికన్ మరియు అమెరికన్ వంటకాలలో దీనిని ప్రధాన పదార్థంగా వాడుతారు. ఈ ఆహారాన్ని అనేక వైద్య పరిస్థితులకు చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఇది పచ్చిదైనా లేదా వండినదైనా తినొచ్చు. “గర్భధారణ సమయంలో మనం మఖాన (తామరగింజలు) తినవచ్చా” అనే సందేహం ఎవరికైనా వస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గర్భవతులు దీనిని సాయంత్రం స్నాక్​గా తినవచ్చు. లేదా కూరలు, సైడ్ డిషెస్, లేదా డిసర్ట్ (తీపి పదార్థం) లోనైనా చల్లుకోవచ్చు.

    మఖాన (తామరగింజలు)లో ఉండే పోషక విలువలు

    అధిక పోషకాలు ఉన్నందున గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు) తినమని చాలా మంది స్త్రీలకు సిఫారసు చేస్తారు. గర్భవతులు తప్పకుండా తీసుకోవాల్సిన అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంలో ఇది కూడా ఉంది. అధిక పోషకవిలువల వల్లే ఇది సాధ్యపడింది.

    ప్రతి 100 గ్రాముల మఖాన (తామర గింజలు) లో ఉండే పోషకాలు ఈ కింది విధంగా ఉంటాయి.

    పోషకాల గురించిన సమాచారం

    100 గ్రాములకు

    ప్రొటీన్

    9.7 గ్రాములు

    కొవ్వులు

    0.1 గ్రాములు

    కేలరీలు

    347 కేలరీలు

    లిపిడ్స్

    0.1 గ్రాములు

    పిండి పదార్థాలు

    76.9 గ్రాములు

    ఫైబర్

    14.5 గ్రాములు

    కాల్షియం

    60 మిల్లీగ్రాములు

    ఐరన్

    1.4 మిల్లీగ్రాములు

    ఈ పోషకాలు మాత్రమే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ B కాంప్లెక్స్ కూడా ఉన్నాయి.

    మఖాన (తామరగింజలు) వండే విధానం

    పైన ఉన్న పోషక విలువల పట్టిక ప్రకారం చూస్తే గర్భవతులు అడిగే సాధారణ ప్రశ్న “గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు ) మంచిదేనా” అనే దానికి అవుననే సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి గర్భవతులు పచ్చిగా ఉన్న మఖాన (తామరగింజలు) కాకుండా ఉడికించిన మఖాన (తామరగింజలు) తినాలని అనుకుంటే.. మఖాన (తామరగింజలు) ఖీర్ లేదా మఖాన (తామర గింజలు) లడ్డూలు వంటి వాటిని చేసుకోవచ్చు. మఖాన (తామరగింజలు)తో వివిధ రకాల వంటకాలను ఎలా తయారు చేయొచ్చో ఇక్కడ ఉంది.

    మఖాన (తామర గింజలు) ఖీర్ (పాయసం)

    మఖానను (తామర గింజలు) రైస్ పుడ్డింగ్ అని పిలువబడే ఖీర్​లో కూడా యాడ్ చేయొచ్చు. ఇది పోషక విలువను మరింత పెంచుతుంది. మఖాన (తామర గింజలు) ఖీర్​లో వేసేందుకు వేయించి మెత్తగా పొడి చేయాలి. ఖీర్​ చేసే సమయంలో పౌడర్​లా మారిన మఖాన (తామర గింజలు)ను మీద చల్లుతారు. ఇది దాని మందాన్ని పెంచుతుంది. మరియు కొత్త రుచిని దానికి జోడిస్తుంది.

    ప్లెయిన్​గా కాల్చడం

    త్వరలో తల్లి కాబోయే వారు పాప్​కార్న్ లేదా ఏదైనా స్నాక్​కు బదులు మఖాన (తామర గింజలు) తినొచ్చు. దీనిని వెన్న లేదా నెయ్యితో లో/మీడియం/హై మంట మీద కాల్చాలి. వేయించిన తర్వాత మఖాన స్నాక్ మీద కావాలనుకుంటే ఉప్పు కానీ కారం కానీ చల్లుకోవచ్చు. లేదా ఒరేగానో కూడా చల్లుకోవచ్చు.

    లడ్డూలు

    మఖాన (తామర గింజలు) నుంచి లడ్డూలను తయారు చేయడం చాలా సులభమైన ప్రక్రియ. దీన్ని తయారు చేసేందుకు మఖాన (తామర గింజలు) వేయించి గ్రైండ్ చేసుకొని ఒక పౌడర్​లా సిద్ధం చేసుకోవాలి. ఈ పౌడర్​ను పాలు మరియు డ్రై ఫ్రూట్స్ వంటి ఇతర పదార్థాలతో కలిపి లడ్డూల తయారీ కోసం మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని గుండ్రగా చేసేందుకు చేతులతో చుడతారు. లడ్డూలు మంచి ఆకృతిలో వచ్చేందుకు వాటిని తయారు చేసేటపుడు చేతులకు నెయ్యి రాయాలి.

    గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు) వల్ల కలిగే ప్రయోజనాలు

    గర్భధారణ సమయంలో మఖాన (తామర గింజలు) వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు

    1. నిద్రలేమిని దూరం చేస్తుంది

    ప్రతి గర్భిణీ స్త్రీ ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నిద్రలేమి. ఇది సాధారణంగా ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్లలో మార్పులు హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తుంది. మఖాన (తామర గింజలు)లో క్వినోలిన్ ఆల్కలాయిడ్స్​తో పాటుగా అవసరమైన విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి విశ్రాంతిని అందించి నిద్రను ప్రేరేపిస్తాయి. అందువల్ల గర్భధారణ సమయంలో మఖాన (తామర గింజలు) తీసుకోవడం మీలో చాలా వరకు నిద్రలేమిని తొలగించడంలో సహాయపడుతుంది.

    2. సాధారణ బీపీ ఉండేలా చేస్తుంది

    గర్భధారణ సమయంలో ప్రతిరోజు మఖాన (తామర గింజలు) తినడం వల్ల గర్భధారణ సమయంలో హెచ్చుతగ్గులకు లోనయ్యే బీపీ కంట్రోల్ అవుతుంది. మఖాన (తామర గింజలు) లో అధిక మొత్తంలో మెగ్నీషియం మరియు సోడియం ఉండడం వలన రక్తపోటు సరిగ్గా ఉంటుంది. సాధారణ బీపీని మెయింటేన్ చేసేందుకు ఇది చాలా ముఖ్యమైనది.

    3. డయేరియాను మేనేజ్ చేస్తుంది

    గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వలన డయేరియా (విరోచనాలు) వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే తామర గింజ లేదా మఖాన గర్భధారణ సమయంలో విరోచనాలకు ఉత్తమ నివారణ మార్గం అని నమ్ముతారు. ఇది బలమైన జీర్ణవ్యవస్థకు హామీ ఇస్తుంది. డయేరియా మరియు ఇతర జీర్ణసమస్యలు రాకుండా ఉండేందుకు గర్భవతులు గర్భం దాల్చిన మొదట్లో ప్రతి రోజు మఖాన (తామరగింజలు) తినాలి.

    4. చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

    చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల చిగుళ్ల సమస్యను ఎదుర్కొంటారు. ఇది చిగుళ్లలో మంటకు దారి తీస్తుంది. మఖాన (తామర గింజలు)లో ఉండే B కాంప్లెక్స్ విటమిన్ స్త్రీకి చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా మఖాన (తామర గింజలు)లో ఉండే జింక్ దంతాలు మరియు చిగుళ్లను ఆరోగ్యంగా బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

    5. ఆకలి పెరుగుదలను కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది

    గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో బరువు పెరుగుతారు. ఈ సమయంలో పెరిగిన ఆకలితో బరువు పెరకుండా మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు) ఎంతో గొప్ప ఆరోగ్యకరమైన స్నాక్. ఇది తక్కువ గ్లెసెమిక్ ఇండెక్స్​ను కలిగి ఉంటుంది. ఒక చిన్న గిన్నెడు మఖాన (తామర గింజలు) తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అతిగా తినాలనే కోరికను ఇది అణచి వేస్తుంది.

    చివరగా..

    మఖాన (తామర గింజలు) గురించి మరియు గర్భధారణ సమయంలో మఖాన (తామరగింజలు) ప్రయోజనాల గురించి స్త్రీలు తెలుసుకోవాల్సిన ప్రతీది ఇక్కడ ఉంది. కాబట్టి నెక్ట్స్ టైం గర్భవతులు స్నాక్స్ కోసం షాపింగ్ చేసినపుడు వారి షాపింగ్ లిస్టులో మఖాన (తామర గింజలు) తప్పనిసరిగా చేర్చాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.