Lowest price this festive season! Code: FIRST10
Updated on 3 November 2023
పాపిల్లరీ క్యాన్సర్ అనేది థైరాయిడ్ క్యాన్సర్‌లో కనిపించే అతి సాధారణ రకం. ఇది అన్ని క్యాన్సర్ కేసులలో 80 శాతం వరకు ఉంటుంది. ఇది పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే, దీనికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. రేడియేషన్‌కు గురి కావడం, థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర, ఇంకా కొన్ని వారసత్వ వ్యాధులతో సహా కొన్నింటినీ ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే కారకాలుగా గుర్తించారు. పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ సాధారణంగా నెమ్మదిగా పెరుగుతుంది. ఇంకా చాలావరకు థైరాయిడ్ గ్రంథి వరకు మాత్రమే పరిమితమవుతుంది. అయినప్పటికీ, ఇది మెడలోని శోషరస గ్రంథుల వంటి ఇతర శరీర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. రోగ నిర్ధారణ తర్వాత, 95 శాతం కంటే ఎక్కువ రోగ నివారణ రేటు ఉండటం మంచి విషయమే. దీనిని ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం, ఎందుకంటే వ్యాధి ముదిరితే అత్యవసర చికిత్సలు, ఇంకా కఠినమైన చికిత్సా పద్ధతుల అవసరం అవుతుంది.
ఎవరైనా పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమాతో బాధపడుతున్నారని అనుకుందాం. అలాంటప్పుడు, చికిత్స అనేది కణితి పరిమాణం, ఇంకా అది ఉన్న స్థానం, క్యాన్సర్ థైరాయిడ్ దాటి వ్యాపించిందా, ఇంకా వయస్సు, శరీర ఆరోగ్యం వంటి వాటితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తం కణితిని తొలగించడానికి పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌కు శస్త్ర చికిత్స చేయడమనేది అత్యంత సాధారణ చికిత్స. క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తే, రేడియోధార్మిక అయోడిన్ లేదా రేడియేషన్ థెరపీతో కూడిన అదనపు చికిత్స అవసరం కావచ్చు. కీమోథెరపీని సాధారణంగా థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించరు. కానీ కాస్త ముదిరిన ఇలాంటి వ్యాధులకు ఈ చికిత్స కూడా ఒక ఎంపిక కావచ్చు. ఇది థైరాయిడ్ గ్రంథికి వచ్చే అతి సాధారణ క్యాన్సర్. ఈ గ్రంథి మెడ ముందు భాగంలో దిగువన గొంతు దగ్గర ఉంటుంది.
ఇది పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది బాల్యంలోనే ఉండవచ్చు, కానీ దాదాపు 20 నుంచి 60 వయసుల మధ్య ఉన్న పెద్దలలో బయటపడుతుంది.
1) పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌లో ఫోలిక్యులర్ రకం : ఇది అన్ని రకాల పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌లలో 20-30% వరకు ఉంటుంది. మహిళలే ఎక్కువగా దీని బారిన పడే అవకాశం ఉంది. ఇంకా ఇది క్లాసిక్ రకం కంటే తక్కువ వేగంతో (నెమ్మదిగా) పెరుగుతుంది. ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ మల్టీఫోకల్ (ఎక్కువ ప్రదేశాలలో) ఇంకా బై లేటరల్ (రెండు వైపులు)గా ఉండే అవకాశం ఉంది. ఈ రకమైన క్యాన్సర్‌లో, కణితి కణాలు పాపిల్లరీ కణాల కంటే ఫోలిక్యులర్ కణాల లక్షణాలకు చాలా దగ్గరి పోలికను కలిగి ఉంటాయి.
2) పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌లో క్లాసిక్ రకం: అన్ని పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌లలో 70-80% వరకు ఈ రకం ఉంటుంది. ఇది పురుషులలో ఎక్కువగా సంభవిస్తుంది. ఫోలిక్యులర్ రకం కంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ రకంలో, కణితి కణాలు ఫోలిక్యులర్ కణాల కంటే పాపిల్లరీ కణాలను చాలా దగ్గరగా పోలి ఉండే లక్షణాలను కలిగి ఉంటాయి.
పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ సాధారణంగా నెమ్మదిగా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ రోగ నిర్మూలనా రేటుని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, క్లాసిక్ రకం మరింత దూకుడుగా ఉండటమే కాక తక్కువ రోగ నిర్మూలనా రేటుని కలిగి ఉంటుంది. పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌లో కనిపించే ఈ లక్షణాలకు చికిత్స చేయడం కష్టం.
పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌లోని కొన్ని లక్షణాలు ఈ క్రింది వాటిని కలిగి ఉండవచ్చు:
ఈ లక్షణాలున్న వారికి థైరాయిడ్ క్యాన్సర్ ఉందని అనుకోకూడదు. కానీ, నిరపాయమైన థైరాయిడ్ నాడ్యూల్ లేదా గాయిటర్ వంటి ఇతర పరిస్థితులలో కూడా అదే లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికైనా పై లక్షణాలలో ఏవైనా ఉంటే, అవసరమైతే, కారణాన్ని కనుగొని చికిత్స చేయించుకొనేందుకు వైద్యుడిని సంప్రదించడం ఎంతో ముఖ్యం.
పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌కు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. అయినప్పటికీ, కొన్ని ప్రమాద కారకాలు ఈ పరిస్థితి బారినపడే అవకాశాన్ని పెంచుతాయి, అవి:
ఈ కారణాలు పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే ప్రమాదంతో మాత్రమే ముడిపడి ఉన్నాయి.
పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న వారు సాంప్రదాయ వైద్య చికిత్సతో పాటు లేదా దాని బదులుగా ప్రత్యామ్నాయ చికిత్సలను ప్రయత్నించవచ్చు. ఈ క్యాన్సర్ ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రస్తుతం శాస్త్రీయ ఆధారాలు లేవు, అయితే కొంతమందికి అవి ఉపయుక్తంగా ఉన్నాయి. పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్‌కు ఉపయోగించే కొన్ని ప్రత్యామ్నాయ చికిత్సలు:
శస్త్రచికిత్స తర్వాత, రోగి రేడియోధార్మిక అయోడిన్ థెరపీని పొందవచ్చు, ఇది తరచుగా నోటి ద్వారా అందించబడుతుంది. ఈ రేడియోధార్మిక పదార్థం ఏదైనా థైరాయిడ్ కణజాలం మిగిలి ఉంటే దాన్ని నాశనం చేస్తుంది. ఇది స్పష్టమైన చిత్రాలను పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. దాని వల్ల క్యాన్సర్ కణజాలాలలో ఏమైనా ఇంకా మిగిలి ఉందా లేకపోతే అది తిరగబెట్టే ప్రమాదముందా అని వైద్యులు గమనించగలుగుతారు.
ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సను ప్రయత్నించే ముందు డాక్టరు గారిని సంప్రదించడం ముఖ్యం. కొన్ని ప్రత్యామ్నాయ చికిత్సలు సంప్రదాయ వైద్య చికిత్సతో మిళితమైనప్పుడు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి.
థైరాయిడ్‌కి వచ్చే ఈ పాపిల్లరీ కార్సినోమా అనేది థైరాయిడ్ క్యాన్సర్‌లలో ఉండే అత్యంత సాధారణ రకం, ఇది అన్నిరకాల క్యాన్సర్ కేసులలో 80-85% వరకు ఉంటుంది. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరిగే క్యాన్సర్, అలాగే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పాపిల్లరీ థైరాయిడ్ కణాలు థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇంకా బాగా చెప్పాలంటే, అవి శ్వాసనాళానికి ఇరువైపులా రెండు థైరాయిడ్ లోబ్స్‌లో(తమ్మెలలో) ఉంటాయి.
Papillary Thyroid Carcinoma in telugu, symptoms of Papillary Thyroid Carcinoma in telugu, treatment for Papillary Thyroid Carcinoma in telugu, Papillary Thyroid Carcinoma in English, Papillary Thyroid Carcinoma in Hindi, Papillary Thyroid Carcinoma in Tamil, Papillary Thyroid Carcinoma in Bengali
Yes
No
Written by
Sri Lakshmi
Get baby's diet chart, and growth tips
গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali
গর্ভাবস্থায় হিং | ঝুঁকি, সুবিধা এবং অন্যান্য চিকিৎসা | Hing During Pregnancy | Risks, Benefits & Other Treatments in Bengali
স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali
গর্ভাবস্থায় পোহা: উপকারিতা, ধরণ এবং রেসিপি | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali
গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali
গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |