hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy arrow
  • గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు arrow

In this Article

    గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు

    Pregnancy

    గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ అనేది తరచుగా మహిళలకు అసౌకర్యాలకు గురిచేసే దశ, ఈ సమయంలో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు అనేది అటువంటి సమస్యే. స్త్రీల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ఇంకా శరీర బరువు పెరుగుతుంది. ఇది కాళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుంది, అందువల్ల గర్భధారణ సమయంలో వచ్చే కాళ్ళ వాపుకు అది దారితీస్తుంది.

    గర్భధారణలో వచ్చే కాళ్ళ వాపు

    గర్భధారణ సమయంలో గర్భవతుల పాదాలు ఇంకా వేళ్లలో వాపును గమనిచవచ్చు. గర్భవతుల శరీరంలో మామూలు స్థాయి కంటే ఎక్కువగా నీటిని కలిగి ఉన్నప్పుడు గర్భధారణ వచ్చే కాళ్ళ వాపు సాధారణంగా కనబడుతుంది. శిశువు ఎదుగుతున్నప్పుడు, గర్భాశయ బరువు కూడా పెరుగుతుంది. పెరిగిన బరువువల్ల, అది వారి పాదాలు ఇంకా కాళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేకాక, దీనివల్ల రక్త ప్రసరణ తగ్గడంతో, శరీరంలో ద్రవాల పరిమాణం పెరిగిపోయి, అది పాదాలు ఇంకా కాళ్ళలో వాపుకు కారణమవుతుంది.

    వాపును తగ్గించడానికి ఏది సహాయపడుతుంది?

    గర్భధారణ సమయంలో కాళ్లలో వాపు సాధారణం, ఇంకా దానిని తక్షణమే నయంచేసుకోలేరు. అయితే, ఈ వాపును తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. గర్భధారణలో కాళ్ళలో వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడే కొన్ని టిప్స్ క్రింద ఉన్నాయి:

    1. ఎక్కువసేపు నిలబడటం మానుకోవాలి

    గర్భవతులు ఎక్కువసేపు నిలబడకుండా చూసుకోవాలి, నిలబడినప్పుడు వారి పాదాలపై ఒత్తిడి పెరుగుతుంది. వారు కూర్చుని విశ్రాంతి తీసుకొనేందుకు కాస్త సమయాన్ని కేటాయించుకోవాలి ఇంకా విశ్రాంతి తీసుకునేటప్పుడు వారు తమ పాదాలను పైకి కాస్త ఎత్తులో ఉంచాలి. వారు తమ పాదాలను చీలమండల వద్ద సున్నితంగా తిప్పవచ్చు ఇంకా పాదాలను వంచడం ద్వారా వారి కాళ్ళ పిక్కల కండరాలను స్ట్రెచ్ చేయవచ్చు. పాదాలను కొంచెం ఎత్తులో పెట్టి పడుకోవడం కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

    2. నడుము-పైదాకా ఉండే ప్రసూతి మేజోళ్ళు ఉపయోగించాలి

    గర్భధారణ సమయంలో కాళ్ళ వాపును తగ్గించడానికి మహిళలకు సహాయపడగలవి ఈ కంప్రెషన్ మేజోళ్ళు. వాపు నుండి ఉపశమనం పొందడానికి రోజంతా సపోర్టివ్ టైట్స్ ఇంకా మేజోళ్ళు ధరించాలి. మోకాలి వరకు ఉండే మేజోళ్ళు వాపును మరింత తీవ్రతరం చేస్తాయని గమనించాలి.

    3. కాస్త వ్యాయామం చేయాలి

    కాళ్ల వాపులను అదుపులో ఉంచుకొనేందుకు శరీరంలో కొంత కదలిక ఉండటం అవసరం. వారి కాలి కండరాలు పనిచేస్తూ ఉండేలా చిన్నపాటి నడకలు ఇంకా అప్పుడప్పుడు సైక్లింగ్ చేయాలి. కొలనులో కొంతసేపు ఈత కొట్టడం కూడా వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక, గర్భవతులు తమ కాళ్ళలో వాపు నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని ఫుట్(పాదాల) వ్యాయామాలు చేయవచ్చు.

    4. ఎడమ వైపునే పడుకోవాలి

    గర్భవతులు కాలిలో ఉండే పరమహాసిరపై ఒత్తిడిని తగ్గించి, వారి పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుచుకొనేందుకు ఎడమ వైపున తిరిగి పడుకోవాలి. ఈ సిర శరీరంలోని దిగువ భాగం నుండి రక్తాన్ని గుండెకు తీసుకువెళుతుంది. దీనిపై ఒత్తిడిని తగ్గించడానికి ఒక దిండును ఉపయోగించి వారు తమ పాదాలను కూడా ఎత్తులో ఉంచుకోవచ్చు.

    5. నీళ్లు తాగాలి

    ఎక్కువగా నీటి తీసుకోవడం వల్ల గర్భవతులు వారి శరీరంలోని అధికమైన ద్రవాలని వదిలించుకోవచ్చు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాపుకు కారణమయ్యే ఈ ద్రవాలని నీళ్ళు భర్తీ చేస్తాయి, తద్వారా పాదాలలో వాపు తగ్గుతుంది.

    6. సోడియం వాడకాన్ని తగ్గించాలి

    శరీరం నుండి అదనపు ద్రవాలను తొలగించడానికి సోడియం తీసుకోవడం తగ్గించడం ఒక ఉత్తమ మార్గం. ఇలా చేయాలంటే, క్యాన్డ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. రోజ్ మేరీ, ఒరేగానో మరియు థైమ్ వంటి వాటిని ఉప్పుకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.

    7. కెఫిన్‌కు నో చెప్పండి

    కెఫిన్ ఒక డైయూరెటిక్(మూత్రవిసర్జన ఎక్కువ చేసే) పదార్ధం, అంటే ఇది తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఇది శరీరాన్ని ద్రవాలను అట్టిపెట్టుకొనేలా చేస్తుంది, అందువల్ల వాపులు తీవ్రమవుతాయి. కాఫీకి బదులుగా డికాఫ్ కాఫీని ప్రయత్నించవచ్చు లేదా కావలసిన శక్తిని పెంచుకొనేందుకు కాఫీని హెర్బల్ టీతో భర్తీ చేయవచ్చు.

    పాదాల కోసం వ్యాయామాలు

    గర్భధారణ సమయంలో వచ్చే కాళ్ళ వాపును తగ్గించడానికి పాదాల వ్యాయామం సహాయపడుతుంది. ఇది పాదాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. పాదాల వాపు నుండి ఉపశమనం పొందేందుకు మహిళలు చేయవలసిన కొన్ని పాద వ్యాయామాలు-

    • గర్భిణీ స్త్రీ పాదాలను వంచి ఇంకా సాగదీయడానికి పైకి క్రిందికి వంచాలి. వారు ఈ కదలికను ప్రతి పాదంలో ముప్పై సార్లు చేయాలి.
    • పాదాలను వృత్తాకారంగా తిప్పుతూ కదిలించి, పాదాలతో చిన్న వృత్తాలు గీయాలి. మెరుగైన ఫలితాల కోసం వారు ఈ కదలికను వరుసగా ఎనిమిది సార్లు సవ్యదిశలో మరియు అపసవ్యదిశలో చేయాలి.

    అసలు ఇలా వాపు వచ్చే కారణం ఏమిటి?

    గర్భధారణ సమయంలో కాళ్ళ వాపు అనేది అతి సాధారణ విషయం, మరియు దాని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. పిండం ఎదుగుదలకు తోడ్పడటానికి శరీరంలో అదనపు ద్రవాలను ఉత్పత్తి అవడం అనేది వాపు వచ్చే ప్రాథమిక కారణాలలో ఒకటి. కాళ్ళలో వాపుకు కారణాలు ఒక త్రైమాసికం నుండి మరొక త్రైమాసికానికి మారుతూ ఉండవచ్చు.

    • మొదటి త్రైమాసికంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలు వేగంగా పెరగడం వల్ల పొత్తికడుపు పైకి తేలేలా చేస్తుంది. ఇది పాదాలు, చేతులు మరియు ముఖంలో కొంచెం వాపును కూడా కలిగిస్తుంది.
    • రెండవ త్రైమాసికంలో, శిశువు ఎదుగుదల కోసం శరీరంలో రక్తం మరియు ద్రవాల పరిమాణం పెరుగుతుంది. ఇది పాదాలపై ఒత్తిడిని కలిగిస్తుంది, దానితో రక్త ప్రసరణ తగ్గడం వల్ల, తరువాత కాళ్లలో వాపు వస్తుంది.
    • మూడవ త్రైమాసికంలో గర్భాశయం పరిమాణం గణనీయంగా పెరిగి, తద్వారా పాదాలలో వాపు వస్తుంది.

    వీటితో పాటు, గర్భధారణ సమయంలో పాదాలలో వాపుకు కారణమయ్యే కొన్ని ఇతర కారణాలు, తీసుకొనే ఆహారంలో అసమతుల్యత, పెరిగిన కెఫిన్ వాడకం, డిహైడ్రెషన్ ఇంకా చుట్టూ ఉన్న వేడి వాతావరణం. కాబట్టి గర్భధారణ సమయంలో కాళ్లలో వచ్చే వాపు గురించి మహిళలు తెలుసుకోవలసిన అన్ని అంశాలు ఇవి. వారి కాళ్లలో వాపుకు దారితీసే అన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఇంకా వాపును తగ్గించుకొనేందుకు పైన తెలిపిన టిప్స్ అనుసరించాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.