hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • తొడ పగుళ్లు: లక్షణాలు, కారణాలు మరియు కనిపించే తీరు | Thigh Chafing: Symptoms, Causes & Presentations in Telugu arrow

In this Article

    తొడ పగుళ్లు: లక్షణాలు, కారణాలు మరియు కనిపించే తీరు | Thigh Chafing: Symptoms, Causes & Presentations in Telugu

    Skin Changes

    తొడ పగుళ్లు: లక్షణాలు, కారణాలు మరియు కనిపించే తీరు | Thigh Chafing: Symptoms, Causes & Presentations in Telugu

    3 November 2023 న నవీకరించబడింది

    తొడ పగుళ్లు అనేది తొడలు ఒకదానికొకటి రాపిడి జరగడం వల్ల చర్మానికి చికాకు కలిగించే పరిస్థితి. దుస్తులు వల్ల చర్మంపై రాపిడి కలగడం వల్ల ఇది సంభవించవచ్చు. అదే స్థలంలో పదేపదే రాపిడి జరగడం వల్ల ఏర్పడుతుంది. ఇంకా తేమతో కూడిన వాతావరణం దానిని మరింత పెంచుతుంది. ఇది తీవ్రమైన పరిస్థితి కానప్పటికీ, అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటుంది.

    తొడ పగుళ్లు: లక్షణాలు, కారణాలు మరియు కనిపించే తీరు (Symptoms and presentations of thigh chafing in Telugu)

    తొడ పగుళ్లు అనేది తొడలు ఒకదానికొకటి రాపిడి జరగడం వల్ల చర్మానికి చికాకు కలిగించే పరిస్థితి. దుస్తులు వల్ల చర్మంపై రాపిడి కలగడం వల్ల ఇది సంభవించవచ్చు. అదే స్థలంలో పదేపదే రాపిడి జరగడం వల్ల ఏర్పడుతుంది. ఇంకా తేమతో కూడిన వాతావరణం దానిని మరింత పెంచుతుంది. ఇది తీవ్రమైన పరిస్థితి కానప్పటికీ, అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: లోపలి తోడ భాగంలో పగుళ్లు: కారణాలు, లక్షణాలు, చికిత్స

    తొడ పగుళ్ల లక్షణాలు, కనిపించే తీరు (Thigh chafing causes in Telugu)

    • ఎర్రబడటం, దద్దుర్లు
    • పొక్కులు లేదా నీటి కురుపులు
    • నొప్పి
    • మంట
    • చర్మం ఊడటం
    • తొడల మీద గాయాలు
    • కొన్నిసార్లు ఇది చీము, వాపు, సున్నితత్వం వంటి లక్షణాలతో అంటువ్యాధులకు దారితీయవచ్చు.

    ఈ లక్షణాలు తరచుగా కలిగి ఉన్న వ్యక్తులలో అదే ప్రాంతంలో పదేపదే చిట్లడం వల్ల చర్మం గోధుమ రంగులోకి మారవచ్చు. ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా ఉంటే, చర్మం శాశ్వతంగా రంగు మారవచ్చు.

    తొడ పగుళ్లకు కారణాలు (Treating chafing thighs in Telugu)

    తొడల చర్మం నిరంతర రాపిడి వల్ల తొడ పగుళ్లు ఏర్పడతాయి. ఒకదానికొకటి రాసుకోవడం లేదా అనుచిత దుస్తులు ధరించడం దీనికి కారణం కావచ్చు. కింది పరిస్థితులలో తొడ పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది:

    • వ్యాయామం లేదా రోజువారీ కార్యకలాపాల వల్ల చెమట
    • నడక లేదా పరుగెత్తడం
    • చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం, తొడల మధ్య తగినంత ఖాళీ ఉండని దుస్తులను ధరించడం
    • తేమతో కూడిన వాతావరణం
    • తేమను పీల్చుకోలేని దుస్తులను ధరించడం
    • చర్మం ముడతల మధ్య తేమ ఉండటం
    • అధిక బరువు ఉన్నవారు లేదా పెద్ద తొడ కండరాలతో ఉన్నవారు
    • సున్నితమైన చర్మం
    • షేవింగ్, జుట్టు తొలగింపు
    • కాలుమీద కాలు వేసుకొని కూర్చోవడం
    • బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల తొడపై గాట్లు ఏర్పడతాయి
    • మందపాటి దుస్తులు ధరించడం

    తొడ పగుళ్లకు చికిత్స (Treatment for Thigh Chafing in Telugu):

    తొడ పగుళ్లు కొన్ని నిమిషాల్లో సంభవిస్తుంది. దీనికి సాధారణ గృహ నివారణలు, ఓవర్-ది-కౌంటర్ మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. ఇది మరింత పెరగకుండా నిరోధించడం చాలా ముఖ్యం. ఏవైనా ఇన్ఫెక్షన్ సంకేతాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

    ఈ వ్యాధికి చికిత్స చేయడానికి ఈ కింద పేర్కొన్న కొన్ని నివారణలు ఉపయోగపడతాయి:

    గుర్తుంచుకోవలసిన మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రభావిత ప్రాంతాలను గోకడం నివారించాలి. చికిత్సకు ముందు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయండి.

    1. తొడ పట్టీలు అనేవి తొడల చుట్టూ రాపిడిని నిరోధించడానికి ధరిస్తారు. వీటిని స్కర్టులు, ప్యాంటు ఇంకా అథ్లెజర్ కింద ధరించవచ్చు. పగుళ్లు ప్రారంభమైన తర్వాత కూడా వీటిని ధరించవచ్చు.
    2. చాఫింగ్ షార్ట్స్ అనేవి తొడ పట్టీలు లాగా ఉంటాయి, కానీ అవి మరింత ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తాయి. ఇవి మరింత చెమటను గ్రహించడంలో సహాయపడుతాయి. ఇవి దుస్తుల కింద వేసుకోవడానికి చాలా బాగా పని చేస్తాయి.
    3. అదనపు రక్షణ అవసరమైతే, థై చాఫింగ్ క్రీమ్ లేదా బామ్‌ను ఉపయోగిస్తారు. ఇది కొత్తగా పగిలిన తొడలకు ఉపయోగిస్తారు. లూబ్రికెంట్‌లతో కూడిన చాఫింగ్ క్రీమ్‌లు మెడికల్ షాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవి రాపిడిని నిరోధిస్తాయి.
    4. బేబీ పౌడర్ తేమను నిరోధిస్తుంది. బేబీ పౌడర్‌ను దుస్తులు ధరించే ముందు పూయడం మంచింది. తీవ్రతను బట్టి రోజంతా తరచుగా పూయాలి. టాల్క్ ఫార్ములాలను నివారించండి, ఎందుకంటే అవి చెమటను గ్రహించవు. మొక్కజొన్నఆధారిత పౌడర్‌లు ఉత్తమమైనవి.
    5. ట్రోలియం జెల్లీ ఉత్తమమైన ఎంపిక, సులభం‌గా దొరుకుతుంది. ఇది చర్మంపై ఒక అవరోధాన్ని ఏర్పరిచి, రాపిడి తీవ్రతను తగ్గిస్తుంది. ఇది చాలా సరసమైన ఎంపిక. ఇది జిడ్డుగా ఉంటుంది, కానీ ఉత్తమ ఎంపికలలో ఒకటి.
    6. ఇతర నివారణాలు అందుబాటులో లేనప్పుడు లిప్ బామ్ ఉపయోగపడుతుంది. ఇది తొడల లోపలి భాగంలోని సున్నితమైన చర్మాన్ని రక్షిస్తుంది. స్టిక్ ఆకారంలో ఉన్న లిప్ బామ్ ఉపయోగించండి.
    7. దురదకి అలోవెరా జెల్, చల్లని ఐస్ ప్యాక్‌లు, ఓట్‌మీల్ ఆధారిత మాయిశ్చరైజర్‌లు ఉపయోగించవచ్చు.
    8. యాంటిహిస్టామిన్లు, యాంటీ ఫంగల్, స్టెరాయిడ్ క్రీమ్‌ల వంటి మందులు వాపు, దురదను తగ్గించడానికి ఉపయోగించవచ్చు.

    తొడ పగుళ్లను నివారించడం:

    తొడలు ఒకదానికొకటి తాకకుండా నిరోధించడానికి తీసుకోవలసిన కొన్ని చర్యలు ఇవి.

    1. చురుకైన, వ్యాయామం చేసే వ్యక్తుల కోసం, కదలికలకు ఎక్కువ స్థలాన్ని కల్పించడానికి స్పాండెక్స్ దుస్తులు ధరించడం మంచిది. ఈ దుస్తులు చెమటను కూడా పీల్చుకుంటుంది.
    2. కాటన్ దుస్తులను నివారించండి. ఎందుకంటే ఇది చెమటను పట్టుకుంటుంది. పాలిస్టర్ లేదా స్పాండెక్స్ ధరించండి.
    3. వదులుగా, బాగా గాలి తగిలే దుస్తులు ధరించండి.
    4. పొడి చర్మం ఉండే భాగాల్లో చెమట ఎక్కువ ఉంటుంది.
    5. తగినంత నీరు తాగండి; ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
    6. దుస్తులు ధరించే ముందు తొడ లోపలి భాగంలో పౌడరను పూయండి.
    7. తరచుగా దుస్తులు మార్చుకోండి.
    8. చెమట పట్టే అవకాశం ఎక్కువగా ఉన్న వ్యక్తులు, రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేయడం లేదా ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, తమను తాము శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

    తొడ పగుళ్లు బాధాకరమైనది, చాలా అసౌకర్యం కలిగిస్తుంది. ఇది వ్యక్తులు తమ అభిరుచులను నెరవేర్చకుండా నిరోధిస్తుంది. తగిన చర్యలు తీసుకోవడం, సౌకర్యమైన దుస్తులు ధరించడం ద్వారా తొడ పగుళ్లను సులభంగా నివారించవచ్చు. ఏదైనా తీవ్రమైన వాపు లేదా ఇన్ఫెక్షన్ కనిపించినట్లయితే, తదుపరి చికిత్స కోసం వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.

    References

    1. Agrawal A, Raibagkar SC, Vora HJ. (2008). Friction burns: epidemiology and prevention. Ann Burns Fire Disasters.

    2. Mazhar M, Simpson M, Marathe K. (2019) Inner thigh friction as a cause of acne mechanica. Pediatr Dermatol.

    Tags

    What are the symptoms and presentations of thigh chafing in Telugu, What are the causes of thigh chafing in Telugu, What are the treatments of thigh chafing in Telugu, Preventions of thigh chafing in Telugu, Thigh Chafing: Symptoms, Causes and Presentations in English, Thigh Chafing: Symptoms, Causes and Presentations in Hindi, Thigh Chafing: Symptoms, Causes and Presentations in Tamil, Thigh Chafing: Symptoms, Causes & Presentations in Bengali

    Baby Powder for Kids - 300 gm

    ₹ 299

    4.0

    (3385)

    1959 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.