hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Premature Delivery arrow
  • ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏమిటి? ఈ శిశువుల లక్షణాలు ఎలా ఉంటాయి? arrow

In this Article

    ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏమిటి? ఈ శిశువుల లక్షణాలు ఎలా ఉంటాయి?

    Premature Delivery

    ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏమిటి? ఈ శిశువుల లక్షణాలు ఎలా ఉంటాయి?

    29 May 2023 న నవీకరించబడింది

    పిల్లలు కలగడం అనేది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన మధురానుభూతి. అయితే, బిడ్డ నెలలు నిండకుండా జన్మించినప్పుడు, అది తల్లిదండ్రులకు తీవ్రమైన ఆందోళనను కలిగిస్తుంది. అలాంటి శిశువు కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు, అలాగే కొంతకాలం NICU (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉంచవలసి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు, శిశువులు అనేక రకాల చికిత్సలకు లోనవుతారు మరియు వారిపట్ల తల్లిదండ్రులు అమితమైన శ్రద్ధను కనబరచాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల వారు తరచుగా అలసిపోవడమూ, ఆందోళన చెందడమూ జరుగుతుంది. చాలా సందర్భాలలో, శిశువులు పూర్తిగా కోలుకుంటారు ఇంకా చికిత్సానంతరం వారిని ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. నెలలు నిండఏకుండా పుట్టే శిశువులు, అసలెందుకు నెలలు నిండకుండా పుడుతున్నారు. వాటి లక్షణాలు, సమస్యలు, చికిత్సలు మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.

    నెలలు నిండని శిశువు అంటే ఎవరు?

    గర్భం దాల్చిన 37వ వారంలోపు, పూర్తిగా నెలలు నిండకుండానే బిడ్డ పుడుతుంది. ఈ సమయంలో, శిశువు అవయవాలు ఇంకా అభివృద్ధి చెందవు మరియు పూర్తిగా రూపుద్దిద్దుకోవడానికి ఇంకాస్త సమయం అవసరమౌతుంది. చాలా సందర్భాలలో, వారు ఐదు పౌండ్ల కంటే తక్కువ బరువుతో పుడతారు. నెలలు నిండకుండానే పుట్టడం అనేది ఏ తల్లిదండ్రులకైనా భయం కలిగించే అనుభవం అవుతుంది.

    పిల్లలు నెలలు నిండకుండానే ఎందుకు పుడతారు?

    కింది చెప్పే కారణాలతో పాటు అనేక కారణాలు ముందస్తు ప్రసవానికి కారణాలవుతాయి::

    1. మహిళలు తమ ఆఫీసులో గానీఈ లేదా ఇంట్లో గాని ఏవైనా రసాయనాల బారిన పడినట్లయితే.
    2. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే.
    3. వారు గర్భం దాల్చిన 36వ వారం తర్వాత వారి మాయ సంచి చిధ్రమైతే వారు బిడ్డను ముందుగానే ప్రసవించవలసి ఉంటుంది.
    4. గర్భవతిగా ఉన్నప్పుడు వారికి STD(సుఖవ్యాధులు) ఉంటే. నెలలు నిండకుండానే శిశువుకు ఇన్ఫెక్షన్ సోకే లేదా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, కొన్నిసార్లు ఇది శిశువు మరణానికి కూడా దారి తీస్తుంది.
    5. ప్లాసెంటా ప్రేవియా, ప్లాసెంటల్ ఇన్సఫిసియెన్సీ లేదా ప్లాసెంటల్ అబ్రక్షన్ వంటి మావి సంబంధ సమస్యలు ఏర్పడినప్పుడు.

    వివిధ కారణాల వల్ల మహిళలు నెలలు నిండని బిడ్డను ప్రసవిస్తారు. అయినప్పటికీ, చాలా సందర్భాలలో, ఇది పొరపాట్ల వల్ల జరగదు, అయితే శిశువు పూర్తిగా అభివృద్ధి చెందడానికి తగినంత సమయం ఉండదు. గర్భవతిగా ఉన్నప్పుడు తమను తాము చక్కగా చూసుకోవడానికి వారు చేయగలిగినదంతా చేయడం వలన ఇలాంటి ముందస్తు ప్రసవం జరిగే అవకాశం తగ్గుతుంది.

    అకాల ప్రసవం లక్షణాలు ఏమిటి?

    అకాల ప్రసవం లక్షణాలలో ఇవి ఉండవచ్చు:

    1. గర్భసంచి సంకోచాలు (నొప్పులు రావడం) ఉండటం ఇంకా అవి కాలక్రమేణా తరచుగా రావడం జరుగుతుంది
    2. వికారం, వాంతులు లేదా అతిసారం
    3. శిశువు కదలికలు తగ్గినట్లు లేదా ఆగిపోయినట్లనిపించడం
    4. పొత్తికడుపులో ఒత్తిడి లేదా నొప్పి
    5. వెన్నునొప్పి
    6. యోనిలో రక్తపు చారలు లేదా రక్తస్రావం జరగడం
    7. యోని నుండి నీరు, జిగురుగా ఉన్నటువంటి స్రావాలు కనబడటం

    మీకు ఇది కూడా నచ్చుతుంది: 8 వారాల ప్రెగ్నెన్సీలో రక్తస్రావం - మీరు వైద్యుడిని సంప్రదించాలా?

    స్త్రీలు తమ గర్భధారణ సమయంలో ఈ లక్షణాలలో దేనినైనా కలిగివుంటే, వారు వీలైనంత త్వరగా తమ వైద్యున్ని సంప్రదించాలి. అకాల ప్రసవానికి అనేక కారణాలుంటాయి ఇంకా ఆరోగ్యకరమైన, సంపూర్ణ గర్భధారణకు అవకాశాన్ని పొందేందుకు వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవడం ఎంతో ముఖ్యం. అకాల ప్రసవానికి చేసే చికిత్సలు అప్పటి పరిస్థితి తీవ్రత ఇంకా ఇతరాత్ర కారకాలపై ఆధారపడి మందులు లేదా సి-సెక్షన్ కూడా చేయవలసి రావచ్చు. మొత్తంమీద, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడమనేది భయం కలిగించే, ఇంకా ఆందోళన కలిగించే విషయమే, కానీ చాలామంది తల్లిదండ్రులు సరైన వైద్య సహాయంతో తమ బిడ్డను ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవచ్చు.​

    సమస్యలు

    నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు ఈ క్రింది వాటితో సహా అనేక రకాలైన సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది:

    • రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (RDS)
    • అంటువ్యాధులు
    • పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉండటం లేదా ఇతర వికాసానికి సంబంధించిన సమస్యలు
    • ఇంట్రావెంట్రిక్యులర్ హెమరేజ్ (IVH)
    • దీర్ఘకాలికంగా ఉండే నరాల సమస్యలు లేదా వైకల్యాలు
    • కామెర్లు, రక్తహీనత ఇంకా ఇతర రక్త సంబంధ రుగ్మతలు

    అసమగ్ర ఆహారపుటలవాట్లు లేదా బరువు పెరుగకపోవడం

    తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలి ఇంకా వాటిని చక్కగా ఎదుర్కొనేందుకు వారి వైద్యులతో కలిసి పని చేయాలి. నెలలు నిండని శిశువులకు మందులు మరియు ఇతర అవసరమైన వైద్య సహాయంతో సహా అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన సంరక్షణ ఇంకా సహాయంతో, చాలా మంది నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాలను పొందారు.

    స్వల్పకాలిక సమస్యలు

    నెలలు నిండని శిశువులలో కనిపించే స్వల్పకాలిక సమస్యలు:

    • రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్
    • అంటువ్యాధులు
    • రక్తంలో చక్కెర శాతం తగ్గడం
    • ఆహారం తీసుకోవడంలో సమస్యలు

    దీర్ఘకాలం పాటు ఉండే సమస్యలు

    నెలలు నిండని బిడ్డలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు:

    • ఎదుగుదలలో ఆలస్యం, ఇంకా వైకల్యాలు
    • దృష్టి మరియు వినికిడి సమస్యలు
    • చర్మం ఇంకా అవయవాల అకాల వార్ధక్యము

    ఇలాంటప్పుడు బిడ్డకు ఆహారం అందించడం సాధ్యమా?

    సాధ్యమే, చాలామంది మహిళలు తమ అకాల శిశువులకు విజయవంతంగా తల్లిపాలు పట్టగలరు. దీనిని మరింత సులభతరం చేయడానికి మెటర్నిటీ బ్రా ఇంకా నిప్పల్ షీల్డ్‌ను ఉపయోగించవచ్చు. తల్లులు తమ నెలలు నిండని బిడ్డకు సక్రమంగా పాలు పట్టడం నేర్చుకోవడంలో సహాయపడే అనేక విభిన్నమైన బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ గ్రూపులు ఇంకా వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి. ముందువైపు తెరుచుకునేలా ఉండే ప్రెగ్నెన్సీ డ్రెస్ పాలు పట్టడాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి, సరైన మద్దతు ఇంకా సహాయంతో, మహిళలు తమ అకాల శిశువులకు విజయవంతంగా ఆహారం అందించగలరు.

    అకాల ప్రసవాన్ని ఎలా ఎదుర్కోవాలి ?

    అకాల ప్రసవాన్ని ఎదుర్కోవడానికి, మొదట అది నిజమా కాదా అని తెలుసుకోవాలి. సాధారణంగా చెప్పాలంటే, గర్భం దాల్చిన 37వ వారానికి ముందు గర్భంతో ఉన్న మహిళ ప్రసవించినప్పుడు దానిని అకాల జననం అని అంటారు. కొత్త తల్లిదండ్రులకు ఇంకా వారి కుటుంబాలకు ఇది భయం కలిగించే, ఇంకా ఆందోళన కలిగించే కష్ట సమయం. అకాల ప్రసవాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడే అనేక విషయాలు ఉన్నాయి. ప్రసవపు నొప్పులు తీవ్రంగా ఉంటే, వాటిని ఆపడానికి ప్రయత్నించడం మొదటి దశ. ఇది విశ్రాంతి, శారీరక శ్రమ, గర్భాశయ కదలిక లేదా ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ వంటి ఇతర పద్ధతుల ద్వారా కూడా చేయవచ్చు. నొప్పులు ఆగిపోయే జాడ కనబడకపోతే, నొప్పులను ఆపేందుకు లేదా నెమ్మదించడానికి డాక్టర్ మందులతో తగ్గించేందుకు నిర్ణయించుకోవచ్చు. పరిస్థితిని బట్టి, ఇది ఎపిడ్యూరల్ లేదా పుడెండల్ బ్లాక్ ద్వారా జరుగుతుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.