hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Women Specific Issues arrow
  • రొమ్ము స్వీయ పరీక్ష అంటే ఏంటీ? రొమ్ము స్వీయ పరీక్ష ఎందుకు చేసుకోవాలి? arrow

In this Article

    రొమ్ము స్వీయ పరీక్ష అంటే ఏంటీ? రొమ్ము స్వీయ పరీక్ష ఎందుకు చేసుకోవాలి?

    Women Specific Issues

    రొమ్ము స్వీయ పరీక్ష అంటే ఏంటీ? రొమ్ము స్వీయ పరీక్ష ఎందుకు చేసుకోవాలి?

    3 November 2023 న నవీకరించబడింది

    రొమ్ము ఆరోగ్యాన్ని ప్రతిబింబించే అనేక పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు, మీ శరీరంలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని మీకు అనుమానం వచ్చినప్పుడు, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ముల స్వీయ పరీక్ష చేయడం ద్వారా ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు. మహిళలకు రొమ్ము స్వీయ పరీక్ష చాలా అవసరం. ఇది క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.

    రొమ్ము స్వీయ పరీక్ష అంటే ఏంటీ?

    రొమ్ములో ఏవైనా గడ్డలు ఉన్నాయా అని మహిళలు తమకు తాముగా పరీక్షించుకునే పద్ధతినే రొమ్ము స్వీయ-పరీక్ష అంటారు. మీరు మీ రొమ్ముల్లో గడ్డలు ఏర్పడ్డాయా, పరిమాణంలో మార్పులు ఉన్నాయా, ఎప్పట్లా కాకుండా ఏవైనా తేడాలు కనిపిస్తున్నాయా అని రొమ్ము స్వీయ పరీక్ష ద్వారా చూడొచ్చు. మీ రొమ్ముల్లో ఏవైనా మార్పులు కనిపించినట్టైతే వైద్యుల్ని కలవాలి. చాలావరకు ఇలాంటి మార్పులు ఎలాంటి అపాయానికి దారితీయవు. క్యాన్సర్ కూడా కాకపోవచ్చు. అయితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపించడానికి క్యాన్సర్ కారణం కావచ్చు.

    చాలావరకు కేసుల్లో.. రొమ్ముల స్వీయ పరీక్షను ఆస్పత్రులు సిఫార్సు చేయవు. ఎందుకంటే ఈ పరీక్ష వల్ల క్యాన్సర్‌ను గుర్తించడం సాధ్యం కాదు. కానీ మీ రొమ్ముల్లో ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవసరం. మార్పుల్ని గమనిస్తే మీ పరిస్థితి గురించి డాక్టర్‌కు వివరించే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్‌తో పాటు, మామ్మోగ్రామ్స్, బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా అవసరం.

    నేను రొమ్ము స్వీయ పరీక్ష ఎందుకు చేసుకోవాలి?

    మహిళలు తమ రొమ్ము ఆరోగ్యం కోసం తమను తాము పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రతీ నెలా రొమ్ము స్వీయ పరీక్ష చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ లేదా రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలతో బయటపడే అవకాశాలు పెరుగుతాయి. అయితే వైద్యులు సూచించిన పరీక్షలు, స్క్రీనింగ్ టెస్టులకు బదులుగా రొమ్ము స్వీయ పరీక్ష చేయడం సరికాదు.

    రొమ్ము స్వీయ పరీక్ష చేసుకునే ముందు, కొన్ని సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. అవేంటంటే:

    1. రొమ్ముల ఆకృతిలో, అనుభూతిలో, రూపంలో ఏవైనా మర్పులు.
    2. చనుమొన నిర్మాణం, ఆకృతిలో మార్పులు.
    3. చర్మంపై ముడతలు పడటం.
    4. రొమ్ము కణజాలంలో గడ్డలు, మచ్చలు, ముడతలు.
    5. చనుమొన నుంచి డిశ్చార్జ్.
    6. చనుమొన లేదా రొమ్ములో కొంత లోపలి వైపు వెళ్లినట్టు కనిపించడం.
    7. రొమ్ములో ఎక్కడో ఓ చోట నొప్పి కలగడం.
    8. చనుమొనపై అలర్జిక్ రియాక్షన్ కనిపించడం.
    9. రొమ్ము వాపు.
    10. చర్మంపై ఎరుపు, మచ్చలు కనిపించడం లేదా వెచ్చగా అనిపించడం.

    ఈ సంకేతాలు ఉన్నట్టైతే మీ రొమ్ము లేదా ఛాతీలో ఏదైనా లోపం ఉందని గుర్తించడానికి సూచనలుగా భావించాలి. మీరు రొమ్ము స్వీయ పరీక్ష చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఒక సంకేతం లేదా పలు రకాల మార్పులు ఉన్నట్టైతే వైద్యుల్ని సంప్రదించాలి. శరీరంలోని ఇతర భాగాల లాగానే.. మీరు మీ రొమ్ముల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం అవసరం. ఎందుకంటే రొమ్ములు చాలావరకు దుస్తుల లోపలే ఉంటాయి. కాబట్టి వాటిని మర్చిపోతుంటారు. అయితే.. తరచూ రొమ్ముల పరీక్షలు జరుపుతుండటం ద్వారా మీ శరీరానికి పూర్తి ఆరోగ్యాన్ని అందించవచ్చు. రొమ్ము స్వీయ పరీక్ష చేయడం చాలా సులభం. మీరు స్నానం చేసేప్పుడు లేదా దుస్తులు విప్పేటప్పుడు లేదా దుస్తులు వేసుకునేప్పుడు రొమ్ము స్వీయ పరీక్ష చేసుకోవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: బ్రెస్ట్ సిస్ట్ (రొమ్ము తిత్తి) అంటే ఏమిటి: రకాలు, కారణాలు, లక్షణాలు & చికిత్స

    రొమ్ము స్వీయ పరీక్ష చేయడానికి స్టెప్స్

    మీ రొమ్ముల్ని చూడటం ద్వారా ఈ విధంగా స్వీయ పరీక్ష చేయొచ్చు.

    • విజువల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కోసం అద్దం ముందు నిలబడాలి.
    • ముందుగా మీ దుస్తులు విప్పేసి, డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడాలి.
    • మీ చేతుల్ని మీవైపు ఉంచడం ద్వారా రొమ్ములు, చనుమొనల ఆకృతి, రంగు, సైజ్ పరిశీలించాలి. ఆ తర్వాత మీ చేతులను పైకి లేపి, మళ్లీ గమనించాలి. ఏవైనా మార్పుల్ని గుర్తించినా, గమనించినా, రొమ్ముల్ని తాకినప్పుడు మీకు ఏదైనా తేడాగా అనిపించినా నోట్ చేసుకోవాలి.
    • చివరగా మీ ఛాతీని వంచి, మీ రొమ్ముల్లో ఏవైనా మార్పులు ఉన్నాయేమోనని గమనించాలి. మార్పులు ఉన్నట్టైతే వైద్యుల్ని సంప్రదించాలి.
    • మీ రొమ్ముల్ని మ్యాన్యువల్ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు.
    • ముందుగా షర్ట్, బ్రా తీసెయ్యాలి. మీ ఎడమ రొమ్మును కుడి చేతితో, కుడి రొమ్మును ఎడమ చేతితో పరీక్షించాలి.
    • ముందుగా తక్కువ ఒత్తిడితో రొమ్ముల్ని పరిశీలించాలి. ఆ తర్వాత ఒత్తిడి కాస్త పెంచాలి.
    • రొమ్ములో మార్పులు, గడ్డలు, ముద్దలు ఉన్నాయేమోనని పరిశీలించాలి.
    • చేతుల్ని వృత్తాకారంలో తిప్పుతూ రొమ్ములోని అన్ని ప్రాంతాలను జాగ్రత్తగా పరీక్షించాలి.
    • చనుమొనల్ని పరిశీలించాలి. చనుమొన నుంచి ఏదైనా డిశ్చార్జ్ అవుతుందేమోనని తెలుసుకునేందుకు నెమ్మదిగా పిండాలి. ఇలాగే మరో రొమ్మునూ పరీక్షించాలి. మీరు పడుకొని కూడా రొమ్ముల్ని పరీక్షించవచ్చు.

    డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి

    రొమ్ములో ఏవైనా మార్పులు కనిపించి, కొన్ని రోజుల పాటు ఆ మార్పులు అలాగే ఉన్నట్టైతే వైద్యుల్ని సంప్రదించాలి. రంగు మారడం, నొప్పి కలగడం, రొమ్ము నుంచి ఏదైనా కారుతున్నట్టు కనిపించడం లాంటి మార్పులు ఉన్నట్టైతే తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి.

    చివరి మాట

    ప్రతీ రోజూ రొమ్ము స్వీయ-పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి చేస్తే చాలు. ఈ ప్రక్రియ ద్వారా మీ శరీరంలో ఏవైనా మార్పులు సంభవించినట్టైతే సులువుగా గుర్తించవచ్చు. ఈ విధంగా మీరు ముందుగానే డాక్టర్ దగ్గరకు వెళ్లి, ప్రాథమిక స్థాయిలోనే చికిత్స పొందడానికి వీలవుతుంది.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.