hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Growth & Development arrow
  • శిశువు అభివృద్ధి లో మైలురాళ్ళు: 3 నెలలు (Baby Developmental Milestone - 3 Months) arrow

In this Article

    శిశువు అభివృద్ధి లో మైలురాళ్ళు: 3 నెలలు (Baby Developmental Milestone - 3 Months)

    Growth & Development

    శిశువు అభివృద్ధి లో మైలురాళ్ళు: 3 నెలలు (Baby Developmental Milestone - 3 Months)

    2 August 2023 న నవీకరించబడింది

    బిడ్డ ఎదుగుదలను చూడటం కోసం ప్రతి తల్లి ఎదురుచూస్తుంది. మూడు నెలల వయస్సు వచ్చేసరికి, శిశువు చాలా మార్పులను చూపించడం ప్రారంభిస్తుంది. శిశువుకు ఎదుగుదలను, సరైన అభివృద్ధిని అందించేందుకు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన తల్లికి ఇది మిశ్రమ భావోద్వేగాలతో నిండే సమయం. ఒక శిశువు తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ సమయానికి చాలా అభివృద్ధి చూపించి ఉత్తేజకరమైన నైపుణ్యాలను చూపుతుంది. తను తన వేళ్ళతో ఆడుకోవడం ప్రారంభిస్తుంది. రాత్రంతా లేవకుండా నిద్రపోతుంది. పదే పదే నవ్వుతూ, తనతో చేసే పనులకు ప్రతిస్పందిస్తుంది. మూడు నెలల శిశువు రెండు రకాల అభివృద్ధిని చూపిస్తుంది. ఒకటి శారీరిక అభివృద్ధి, రెండోది మెదడు అభివృద్ధి చెందడం (మానసిక అభివృద్ధి). వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం.

    శారీరక అభివృద్ధి (Body Development)

    శిశువుకు మూడు నెలల వయస్సు వచ్చినప్పుడు మీరు చూసే శారీరక మార్పులను చూద్దాం.

    • శిశువు సంరక్షకుని సువాసనను గుర్తిస్తుంది. ఆ వ్యక్తితో మరింత సుఖంగా ఉంటుంది. వేరొకరు ఎత్తుకున్నప్పుడు లేదా తాకినప్పుడు ఏడవడం ప్రారంభిస్తుంది.
    • శిశువు మూడు నెలల వయస్సులో తన పరిసరాల గురించి తెలుసుకుంటుంది. ఎక్కువ ప్రాధాన్యతలను కలిగి ఉండి స్పర్శలకు ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది.
    • శిశువు తన వేలు లేదా బొటనవేలును చీకడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే శిశువు‌కు పళ్ళు రావడం మొదలవుతాయి. బొటనవేలు చప్పరింపు శిశువుకు విశ్రాంతిని కలిగిస్తుంది
    • శిశువు 90-డిగ్రీల పొజిషన్‌లో తన తలను మరింత పైకి లేపడం ప్రారంభిస్తుంది. కొంత మద్దతు సహాయంతో కూర్చోవడానికి ప్రయత్నిస్తుంది.
    • శిశువు తల్లిదండ్రులు చేతులు పట్టుకోవడంతో అతను కాళ్లపై బరువు మోపడం ప్రారంభిస్తాడు. మీరు అతని కాళ్ళను బలోపేతం చేయడానికి అతనిని నిలబెట్టడానికి ప్రయత్నించవచ్చు.
    • అతను తన పొట్టపై పడుకున్నప్పుడు తన ఛాతీని ఎక్కువగా ఎత్తడం ప్రారంభిస్తాడు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిబిడ్డలలో కమ్యూనికేషన్: మైల్‌స్టోన్స్ & యాక్టివిటీస్

    మెదడు అభివృద్ధి (Brain Development)

    శిశువుకు మూడు నెలల వయస్సు వచ్చినప్పుడు మీరు గమనించే మానసిక అభివృద్ధిని ఇప్పుడు చూద్దాం.

    • శిశువు మరింత స్పష్టంగా వినడం ప్రారంభిస్తుంది. మీకు మరిన్ని ప్రతిస్పందనలను ఇవ్వడం ప్రారంభిస్తుంది.
    • శిశువు చుట్టూ ఉన్న వస్తువులు మరింత స్పష్టంగా కనిపించడం మొదలుపెడతాయి. శిశువు దగ్గరలో చూసే బొమ్మలు, వస్తువులతో ఆడుకోవడం ప్రారంభిస్తుంది.
    • శిశువు తాను చూసే వస్తువులను అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.
    • శిశువు నెమ్మది నెమ్మదిగా పట్టుకోవడం ప్రారంభిస్తుంది.
    • శిశువు ప్రతిరోజు తన రూపాన్ని మారుస్తుంది. అది తల్లితండ్రులను మరింత ఉత్తేజితులను చేస్తుంది.

    మీ పిల్లల ఎదుగుదలను చూడటం అనేది ప్రతి తల్లిదండ్రులు వారి జీవితమంతా ఎంతో సంతోషించే ప్రయాణం. మీ బిడ్డకు మూడు నెలల వయస్సు వచ్చినప్పుడు, మీరు అతనిలో మార్పులు వేగంగా రావడం చూస్తారు. తల్లిదండ్రులు శిశువుతో మరిన్ని యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నించాల్సిన సమయం ఇది. ఇది పిల్లలను మరింత చురుకుగా చేసి వారు సరిగ్గా ఎదిగేందుకు సహాయపడుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ పిల్లల అభివృద్ది కోసం ముఖ్యమైన గేమ్స్, యాక్టివిటీస్

    Tags:

    Baby development in telugu, Baby developmental stages in telugu, What are the stages of baby development in telugu, baby speaking milestone in telugu, baby brain development in telugu.

    Also Read in:

    Bengali: শিশুর বিকাশের মাইলস্টোন : 3 মাস (Baby developmental milestones 3 months in Bengali)

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.