Lowest price this festive season! Code: FIRST10
Women Specific Issues
28 November 2023 న నవీకరించబడింది
కొందరిలో వంకరతిరిగిన, లేదా వెనక్కి మడిచినట్టున్న చనుమొనలు ఉండటం జరుగుతుంది. అది ఒక నిర్మాణలోపం కావచ్చు. చూడడానికి అది కిందికి వంచబడ్డ త్రికోణాకారంగా కనబడుతుంది. కొంతమందిలో ఇలా వంకరగా ఉండటమే కాకుండా కొంత నొప్పి, చర్మం మీద చిన్నచిన్న కాయలు (skin tags) వేలాడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే, వారు తప్పనిసరిగా, వీలైనంత త్వరగా డాక్టరును సంప్రదించాలి. ఇటువంటి సమస్యలకు వారు చక్కని పరిష్కారాన్ని వెంటనే పొందడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే ఈ సమస్యకి చాలా రకాల చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
ఒకవేళ ఎవరైనా అలాంటిది గమనించి, ఆ సమస్యకోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియక బాధపడుతుంటే, ఆ వ్యక్తి ఆలస్యం చేయకుండా తమ డాక్టరును సంప్రదించడం వల్ల చాలా త్వరగా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆలోచిస్తూ ఆలస్యం చేయటం ఎంతమాత్రం మంచిది కాదు. ఆలస్యం అయినకొద్దీ చివరికి సర్జరీ దాకా వెళ్ళవచ్చు. ఒక్కోసారి అది ఆ సర్జరీ దశను కూడా దాటిపోవచ్చు.
స్త్రీలలో వంకరతిరిగిన చనుమొనలకు ఒక్కోసారి జన్యులోపాలు, హార్మోను లోపాలతో పాటు, పిలల్లకు పాలు ఇవ్వడం కూడా కారణం కావచ్చు. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు కాని, లేక మెనోపాజ్ దశలో గాని కలిగే హార్మోను మార్పులు కూడా కారణం కావచ్చు. ఒక్కోసారి ధైరాయిడ్ హార్మోను ఎక్కువ తక్కువలు అవడం ద్వారా, వారి శరీరం ఆడవారికి అతి ముఖ్యమైన ఈస్ట్రోజన్ ను సరిగా వినియోగించుకోకపోవడం కూడా కారణం కావచ్చు. ఇలాంటి మార్పులు మీరు కనక గమనిస్తే, వైద్యులను సంప్రదించి ఆ సమస్యను సరిచేసుకోవడానికి కావలసిన అన్నిరకాల పరిష్కార మార్గాలను తెలుసుకోండి.
సాధారణంగా చిన్నచిన్న కారణాలవల్ల ఇలాంటి స్థితి కలిగి ఉంటే సర్జరీ అవసరం పడకపోవచ్చు. కొన్ని సామాన్య చికిత్సామార్గాల ద్వారా కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కాని, ఈ విధమైన నిర్మాణం మీకు అందంగా ఉండటం లేదనే బాధను కలిగిస్తుంటే కొన్ని ఇంట్లోనే చేసుకునే ఇతర చికిత్సా విధానాల ద్వారా దీనిని పరిష్కరించుకోవచ్చు.
స్త్రీలు తమ ఇంట్లోనే ఉండి తమ చనుమొనల స్థితిని సవరించుకోవడానికి క్రింద కొన్ని పద్ధతులు సూచించబడ్డాయి.
బ్రెస్ట్ పంపును ఉపయోగించి, దానిలో నుంచి గాలిని పంపడం ద్వారా మెలితిరిగిన చనుమొనలను సరిగా మారేలాగా, బయటకు పొడుచుకు వచ్చేలా చేయవచ్చు.
ఒక్కొక్కసారి చనుమొనలను గుండ్రంగా మర్దిస్తూ ఉద్దీపింపచేయడం ద్వారా వాటిని పైకి పొడుచుకు వచ్చేలా చేయటం కూడా జరుగుతూ ఉంటుంది.
ఈ పద్ధతి చనుమొనలను పైకి రప్పించడం (nipple stimulation) కి వ్యతిరేకం. చనుమొనలను మర్దించడం, పైకి లాగడం కాకుండా, లోపలికి, వెన్ను భాగం వైపుకు నొక్కడం ద్వారా వాటిలో కదలికలను కలిగించవచ్చు. అందువల్ల, చన్నులలో ఉండే వేరు వేరు కండరాలు ప్రభావితమై, మళ్ళీ, చనుమొన భాగానికి తగిన రక్త సరఫరా అయ్యేలాగా తోడ్పడతాయి.
చాలామంది స్త్రీలు తమ చన్నుల చివరిభాగాన్ని కుట్టించుకోవడం ద్వారా చన్నులు వంకర తిరగకుండా ఆపవచ్చు అని నమ్ముతుంటారు. కొందరిలో అలా కుట్టించుకోవడం వల్ల చనుమొనలు లోపలికి మెలి తిరిగి ముడుచుకుపోకుండా బయటకే నిలబడినట్టు ఉండటం జరుగుతూ ఉంటుంది కూడా. కాని అదే ఈ సమస్యకు సరైన పరిష్కారం అని పూర్తి ఋజువుగా గాని, ఆ విధానం అందరికీ ఖచ్చితంగా పనికి వస్తుంది అనే నిర్ధారణగా గాని చెప్పలేము. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా, దానికంటే ముందుగానే వైద్యులను కలవండి.
ఒకవేళ సర్జరీదాకా పోవడం ఇష్టంలేక దానికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఆలోచించాలి అంటే దానికి ఈ ఇంజక్షను చికిత్సను తీసుకోవచ్చు. ఇందులో హైలురోనిక్ యాసిడ్ ను చనుమొనల క్రింది చర్మంలోనికి ఇంజక్షను సిరంజి ద్వారా పంపడం జరుగుతుంది. ఈ హైలురోనిక్ యాసిడ్ చనుమొనలను గట్టిపరిచి సరైన ఆకారాన్ని పొందడానికి దోహదపడుతుంది. కాని ఇదే చికిత్స అందరికీ వర్తిస్తుందని చెప్పలేము. కాబట్టి వైద్యులు నిర్థారణ చేసినప్పుడు మాత్రమే ఈ విధానానికి వెళ్ళడం మంచిది.
ఇన్వాసివ్ చికిత్స ఎంపిక: శస్త్రచికిత్స( Invasive treatment option: Surgery)
చనుమొనలను సరైన ఆకారంలోనికి తేవడానికి రెండు రకాల శస్త్ర చికిత్సలు ఉన్నాయి. ఒక పద్ధతిలో స్త్రీ వక్షోజంలో ఉండే క్షీరనాళాలను (గొట్టాలు) అలానే ఉంచి శస్త్ర చికిత్సను చేయడం, మరో పద్ధతిలో వాటిని తొలగించి ఆపరేషన్ చేయడం. మూడో పద్ధతిలో క్షీరనాళాలను కొన్నింటిని తొలగించి, కొన్నింటిని ఉంచడం.
నిజానికి అసలు మెలితిగిన చనుమొనలతో పిల్లలకు పాలను ఇవ్వడం తల్లీపిల్లలు ఇద్దరికీ చాలా అసౌకర్యంగా ఉంటుంది. తల్లికి విపరీతమైన నొప్పి మాత్రమే కాక, వారికి పాలను ఇచ్చే గ్రంథులలో ఇన్ఫెక్షన్లు చేరడం, ఆ గ్రంథులలో వాపు రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. పిల్లలు వారికి సరిగా ఆహారం అందక, అదేపనిగా చీకడం వల్ల చాలా పాలు వృధాగా పోయే అవకాశం కూడా ఉంది.
అంతేకాక అలా వెనక్కి మెలితిరిగిన చనుమొనల వల్ల, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోనుల తయారీలో ఎక్కువతక్కువలు, జన్యు సంబంధిత హార్మోన్ల సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. చివరికి పాల ఉత్పత్తికి కారణమైన ప్రొలాక్టిన్ లో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి.
మీకు ఒకవేళ ఇలా వెనక్కు మెలితిరిగిన చనుమొనలు ఉంటే, తప్పనిసరిగా వైద్యులను కలిసి, అన్నిరకాల చికిత్సా పద్ధతులను గురించి చర్చించండి. మీకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకోండి. మీకు సరైన చికిత్సను అందించడంలో మీ వైద్యులు మీకు తప్పకుండా సహాయపడగలరు. వారి నుంచి సరైన వైద్య సలహాను స్వీకరించి, పాటించండి.
Nagaraja Rao D, Winters R. (2022). Inverted Nipple. www.ncbi.nlm.nih.gov
Tags
Inverted Nipples: Causes, Treatment and More in English, Inverted Nipples: Causes, Treatment and More in Tamil, Inverted Nipples: Causes, Treatment and More in Bengali
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu
పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU
చనుమొన డిశ్చార్జ్కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)
మీ 6 నెలల పసిబిడ్డకి ఎంత మొత్తంలో & ఎంత తరచుగా ఘన పదార్థాలు ఆహారంగా పెట్టవచ్చు?|How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old in Telegu
పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)
శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |