Lowest price this festive season! Code: FIRST10
Caring for your Newborn
29 May 2023 న నవీకరించబడింది
మీ ఇంట్లోకి కొత్తగా పసిబిడ్డ వచ్చినందుకు శుభాకాంక్షలు! ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో శిశువు తమ ఇంట్లోకి, జీవితంలోకి అడుగుపెట్టడం అత్యంత సంతోషకరమైన సందర్భాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ.. నవజాత శిశువు సంరక్షణ చూసుకోవడం కూడా సవాలే. నవజాత శిశువు బాగోగులు చూసుకోవడం ఉత్తేజకరంగా ఉంటుంది. కానీ అంతే కష్టంగా కూడా ఉంటుంది. కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని బేసిక్ టిప్స్, గైడెన్స్‌తో, ఎవరైనా తమ పసిబిడ్డ సంరక్షణను నమ్మకంగా చూసుకోవచ్చు. ఈ బ్లాగ్‌లో నవజాత శిశువు సంరక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ వివరించాం. అందులో ఫీడింగ్, శుభ్రత, భద్రతా చర్యల గురించి కూడా టిప్స్ ఉన్నాయి. ఇక చదవండి.
కొత్తగా తల్లైనవారికి బేబీ కేర్ టిప్స్ గురించి తెలుసుకోండి:
1. శిశువును శుభ్రంగా, పొడిగా ఉంచండి.
2. బంధం బలపర్చుకోండి.
3. నిద్ర.
4. ఫీడింగ్.
5. వ్యాధి నిరోధక టీకాలు.
6. భద్రత.
న్యాపీ ర్యాష్, చర్మానికి చికాకును నివారించడం కోసం బేబీ చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం. న్యాపీ మార్చే ప్రతీసారి.. అన్‌సెంటెడ్ అంటే సువాసన లేని బేబీ వెట్ వైప్స్‌తో డైపర్ ఏరియాలో క్లీన్ చేయాలి. అవసరమైతే క్రీమ్ అప్లై చేయాలి. చాలామంది తల్లిదండ్రులకు క్లాత్ డైపర్స్ లేదా డిస్పోజబుల్ డైపర్స్ గొప్ప ఆప్షన్‌గా ఉంటాయి. కానీ శిశువుకు చికాకు కలగకుండా ఉండేందుకు తప్పనిసరిగా లైనర్‌ను ఉపయోగించాలి.
శిశువు అభివృద్ధిలో బంధాన్ని పెంచుకోవడం కూడా కీలకమే. పసిబిడ్డను కౌగిలించుకోవడం, మాట్లాడటం, ఆడుకోవడం లాంటి వాటితో బంధాన్ని బలపర్చుకోవచ్చు. అంతేకాదు వారి అవసరాలను గుర్తించి వెంటనే స్పందించడం కూడా ముఖ్యమే. వాళ్లు ఆకలితో ఉన్నా, న్యాపీ మార్చాలన్నా, వీలైనంత త్వరగా స్పందించాలి.
నవజాత శిశువులు ఎక్కువగా నిద్రపోతారు. అయితే వారి స్లీప్ ప్యాటర్న్స్‌ని గుర్తించడం, అంచనా వేయడం చాలా కష్టం. వారికి ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తే అప్పుడు నిద్రపోనివ్వాలి. కొన్ని గంటలకు ఓసారి నిద్రలేపి పాలు ఇవ్వాలి. బెడ్ టైమ్ రొటీన్ అలవాటు చేయడం ద్వారా శిశువులకు, వారి తల్లిదండ్రులకు రాత్రి వేళలో మంచి నిద్రకు తోడ్పడుతుంది.
కొత్తగా తల్లైనవారు తల్లిపాలు ఇస్తున్నా లేదా బాటిల్ ఫీడింగ్ చేస్తున్నా ఒక విషయం గుర్తుంచుకోవాలి. శిశువు ఆకలితో ఉన్నప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి. మొదట్లో ప్రతీ 2 గంటలకు ఓసారి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. పెరుగుతున్నకొద్దీ కాస్త తక్కువసార్లు ఫీడింగ్ అవసరం అవుతుంది. అప్పుడు రాత్రి సమయంలో ఎక్కువ గంటలు నిద్రపోతుంటారు.
నవజాత శిశువుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. పలురకాల వ్యాధుల నుంచి కాపాడాల్సి ఉంటుంది. అందుకే వారికి వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. యూఎస్‌లోని శిశువులకు హెపటైటిస్ బీ, రొటావైరస్, డిప్థీరియా, టెటానస్, పెర్టస్సిస్ (కోరింత దగ్గు నివారణ) వ్యాక్సిన్లతో పాటు ఇతర అనారోగ్యాలబారిన పడకుండా టీకాలు ఇస్తుంటారు.
పిల్లలు ఆసక్తిగా, అన్వేషించడానికి ఉత్సాహంతో ఉంటారు. కానీ వారికి ఏది సురక్షితమో, ఏది కాదో తెలుసుకోవడం కష్టం. అందుకే ప్రమాదాలను నివారించడానికి బేబీ ప్రూఫ్ హోమ్ సిద్ధం చేయాలి. పవర్ సప్లై బోర్డులను కవర్ చేయాలి. మెట్లు ఉంటే కింద, పైన గేట్లు ఉండటం తప్పనిసరి. అన్ని డ్రాయర్స్, కేబినెట్స్ సురక్షితంగా మూసెయ్యాలి.
శిశువులకు పోషణ విషయానికి వస్తే, ఆహారం నాణ్యత కన్నా, పరిమాణం ముఖ్యం. శిశువు మొదటి 6 నెలల జీవితంలో తల్లి పాలు పూర్తి ఆహారంగా పరిగణిస్తారు. ఆతర్వాత రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగిస్తూనే.. ఇతర ఆహారపదార్థాలను అలవాటు చేస్తుండాలి. నవజాత శిశువు సంరక్షణ కోసం ఇది చాలా ముఖ్యమైన అంశం. అంతేకాదు, తల్లి తీసుకునే నాణ్యమైన ఆహారం కూడా. పరోక్షంగా శిశువుకు ఇచ్చే తల్లిపాల నాణ్యతపై ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ తల్లి పలు రకాల, పలు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోతే.. శక్తి తక్కువగా ఉండటమే కాదు, త్వరగా అలసిపోతుంది కూడా. ఫలితంగా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆసక్తి తగ్గిపోవడమే కాదు, పాలు ఇవ్వడం ఆపే పరిస్థితి కూడా రావొచ్చు.
ఇక నవజాత శిశువుకు ఇన్ఫెక్షన్‌ని నియంత్రించడం కూడా కొత్తగా తల్లైనవారు గుర్తుంచుకోవాల్సిన రెండో ముఖ్యమైన టిప్. నవజాత శిశువుల్లో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు కాబట్టి, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. శిశువు దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు, పరిచయస్తులు ఎవరైనా చిన్నప్పుడు సాధారణంగా వచ్చే గవదబిళ్లలు, తట్టు, రుబెల్లా లాంటి వ్యాధుల నివారణకు టీకాలు వేసుకున్నారో లేదో నిర్ధారించుకోవాలి. తల్లిదండ్రులు న్యాపీస్ మార్చిన ప్రతీసారి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లల్ని దగ్గరకు తీసుకునేప్పుడు కూడా చేతులు కడుక్కోవడం తప్పనిసరి. క్రాస్ ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం డిస్పోజబుల్ న్యాపీస్ ఉపయోగించడం మంచి ఆప్షన్.
కొత్తగా తల్లైనవారు శిశువుల సంరక్షణ కోసం పాటించాల్సిన మూడో టిప్ థర్మల్ ప్రొటెక్షన్. పెద్దవారిలా నవజాత శిశువులు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేరు. అందుకే పిల్లలు చల్లగా ఉన్నారో.. వెచ్చగా ఉన్నారో.. తెలుసుకోవడం తప్పనిసరి. శిశువు ఉన్న చోట 68 నుంచి 72 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత ఉండటం మంచిది. శిశువుకు తేలికగా ఉండే, బ్రీథబుల్ క్లాత్‌తో చేసిన దుస్తులు వేయాలి. బ్లాంకెట్స్ లేదా క్విల్ట్స్ ఉపయోగించకూడదు.
ఇక నవజాత శిశువు సంరక్షణలో నాలుగో టిప్ విషయానికి వస్తే డెలివరీ అయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. బిడ్డ పుట్టిన 24 గంటల్లో పూర్తి శారీరక పరీక్ష చేయించాలి. హార్ట్ రేట్, శ్వాస తీసుకోవడం, ప్రతిచర్యలు, బరువు, ఎత్తు, తల చుట్టుకొలత, సాధారణంగా వచ్చే జన్యుపరమైన రుగ్మతల్ని పరీక్షించడం తప్పనిసరి. నెలలు నిండకుండా లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు మరింత సమగ్రమైన పరీక్ష అవసరం. జాండీస్, వినికిడి పరీక్షలు చేయించాలి.
నవజాత శిశువుల సంరక్షణ కోసం కొత్తగా తల్లైనవారు పాటించాల్సిన ఐదో టిప్ ఆరోగ్య సమస్యల అంచనా. నవజాత శిశువుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు వారి వినికిడిని పరీక్ష చేయాలి. నెలలు నిండకుండా లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు సికిల్ సెల్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకరమైన బ్లడ్ డిజార్డర్స్ పరీక్షలు చేయించాలి. నెలలు నిండిన తర్వాత పుట్టిన పిల్లలు అయినా సరే.. వారి కుటుంబ చరిత్రలో ఇలాంటి అనారోగ్య పరిస్థితులు ఉంటే పరీక్షలు చేయించడం తప్పనిసరి. నవజాత శిశువులకు జాండీస్ టెస్ట్ అంటే కామెర్ల పరీక్ష కూడా చేయించాలి. వారి చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడానికి ఇది కారణం అవుతుంది. కామెర్లు ప్రమాదకరం కాదు కానీ, తీవ్రమైన అనారోగ్య పరిస్థితికి దారితీయొచ్చు. అందుకే వైద్యుల్ని తప్పనిసరిగా కలవడం మంచిది.
తల్లిదండ్రులు శిశువులు ఇచ్చే కొన్ని ప్రమాదకరమైన సంకేతాలను విస్మరించకూడదు. వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రమాదకరమైన సంకేతాల్లో వేగంగా శ్వాసతీసుకోవడం, పెదవులు లేదా వేళ్లు నీలి రంగులోకి మారడం, నిద్ర లేవడానికి ఇబ్బంది ఎదుర్కోవడం, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోవడం లాంటివి ఉంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఇలాంటి సంకేతాలను గుర్తించినట్టైతే శిశువును వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
ఒకవేళ శిశువు ఆరోగ్యంపై తల్లిదండ్రులకు ఆందోళన ఉంటే వైద్యసాయం పొందడానికి ఏమాత్రం ఆలోచించకూడదు. స్థానికంగా ఉండే వైద్యుల దగ్గరకు వెళ్లాలి. వారికి అత్యవసరంగా వైద్యసాయం అవసరం అయితే ఆస్పత్రికి వెళ్లాలి. శిశువుకు వైద్యసాయం అవసరమా లేదా అని తెలుసుకోవాలనుకుంటే, ఔట్ ఆఫ్ హవర్స్ సర్వీస్‌కు కాల్ చేసి సలహా తీసుకోవచ్చు.
ఇవి కొత్తగా తల్లైనవారు వారి నవజాత శిశువు సంరక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్. తల్లిదండ్రులకు ఏదైనా అంశంపై స్పష్టత లేనట్టైతే వైద్యసాయం తీసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేయకూడదు. ప్రతీ తల్లి నవజాత శిశువు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన సంరక్షణ చర్యల గురించి తెలుసుకోవడం అవసరం. ఈ ఆర్టికల్‌లో నవజాత శిశువు సంరక్షణ కోసం కావాల్సిన టిప్స్ అన్నింటినీ కవర్ చేయడానికి ప్రయత్నించాం.
Yes
No
Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips
ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఏమిటి? ఈ శిశువుల లక్షణాలు ఎలా ఉంటాయి?
నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ (NEC): రకాలు, కారణాలు, లక్షణాలు & చికిత్స
ఉద్రేక ఆందోళన: దీని లక్షణాలెలా ఉంటాయి? కారణాలు మరియు చికిత్స గురించి ఇపుడే తెలుసుకోండి.
గర్భధారణలో ఆముదం: గర్భధారణ సమయంలో ఆముదం ఎందుకు వాడతారు? దీనివల్ల కలిగే ప్రమాదాలేంటి?
గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు
మెనోపాజ్ తర్వాత స్త్రీ గర్భం దాల్చవచ్చా?
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |