hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore

Lowest price this festive season! Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • లక్షణాలు, చికిత్సలు & ఉపశమనానికి చిట్కాలు arrow

In this Article

    లక్షణాలు, చికిత్సలు & ఉపశమనానికి చిట్కాలు

    Pregnancy

    లక్షణాలు, చికిత్సలు & ఉపశమనానికి చిట్కాలు

    3 November 2023 న నవీకరించబడింది

    పరిచయం

    బిడ్డను కనడం అనేది సంతోషకరమైన సమయం. కానీ ఇది గొప్ప నిద్ర లేమి సమయం కూడా కావచ్చు. కొత్తగా తల్లులైన వారిలో చాలా మంది ప్రసవానంతర నిద్రలేమి అనేది చాలా మందికి ఉండే సమస్య. ఎవరైనా ఆడవాళ్ళు తగినంత విశ్రాంతి తీసుకోలేక ఇబ్బందిపడుతుంటే.. అటువంటి సమస్య వారిదొక్కరిదే కాదు. ఈ బ్లాగ్ పోస్ట్ ప్రసవానంతర నిద్రలేమి నుండి ఉపశమనం కోసం లక్షణాలు, చికిత్సలు, చిట్కాలను తెలియజేస్తుంది.

    ప్రసవానంతర నిద్రలేమి అంటే ఏమిటి?

    ప్రసవానంతర నిద్రలేమి అనేది ప్రసవం తర్వాత కొన్ని వారాలలో నెలలలో ఏర్పడే అనారోగ్యం. ఇది నిద్రలేమి, నిద్రపోవడానికి ఇబ్బందిగా ఉండటం, పగటిపూట అలసటగా ఉండటం, ఇంకా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది.

    ప్రసవానంతర నిద్రలేమికి కారణాలు

    సవానంతర నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. దీనివల్ల చికిత్స చేయడానికే ఇబ్బంది కలిగే పరిస్థితిని కలిగిస్తుంది. వాటిలోని అత్యంత సాధారణ కారణాలలో కొన్ని:

    • హార్మోనల్ మార్పులు: ప్రసవించిన తర్వాత, గర్భధారణకు ముందు ఉన్న స్థితికి తిరిగి రావడానికి స్త్రీ హార్మోన్లు వేగంగా మారుతాయి. ఈ హార్మోన్లలో మార్పులు నిద్రకు అంతరాయాలను కలిగిస్తాయి.
    • ఆందోళన, ఒత్తిడి: ప్రసవానంతర కాలంలో ఆందోళన, ఒత్తిడి సర్వసాధారణం. మాతృత్వం వల్ల కలిగే మార్పులు, నిద్ర లేకపోవడం, చంటిబిడ్డ గురించి ఆందోళన వంటి అనేక కారణాల వల్ల ఇవి కలుగవచ్చు.
    • డిప్రెషన్: ప్రసవానంతర నిద్రలేమికి మరొక సాధారణ కారణం డిప్రెషన్. ప్రసవం తర్వాత జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, మాతృత్వం యొక్క కొత్త బాధ్యతల వల్ల ఇది కలుగవచ్చు.
    • నొప్పి: ప్రెగ్నెన్సీ లేదా ప్రసవ సమయంలో వచ్చే నొప్పి కూడా నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రలేమికి దారితీస్తుంది.

    ప్రసవానంతర నిద్రలేమితో ఎవరైనా బాధపడుతున్నట్లయితే. దానికి కారణాలు, చికిత్సల గురించి డాక్టర్‌తో మాట్లాడటం చాలా ముఖ్యం.

    ప్రసవానంతర నిద్రలేమి యొక్క లక్షణాలు

    కొత్తగా తల్లులైన వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత మొదటి కొన్ని వారాలలో కొద్దిపాటి నిద్రలేమి ఉండటం సర్వసాధారణం. కానీ కొందరికి ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. ప్రసవానంతర నిద్రలేమి యొక్క కొన్ని లక్షణాలు, కొన్ని రకాల చికిత్సలు, ఉపశమన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

    ప్రసవానంతర నిద్రలేమి యొక్క అత్యంత సాధారణ లక్షణం నిద్రపోవడానికి కష్టంగా ఉండటం. కొత్తగా పిల్లలు పుట్టినవారికి ఆందోళన, హార్మోన్ల మార్పులు, సాధారణ నిద్ర దినచర్యకు ఆటంకాలు కలగటం వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. ఒక కొత్తగా తల్లిగా మారిన స్త్రీకి ఎలాగోలా నిద్రలోకి జారుకున్న తర్వాత, తరచుగా వారు రాత్రంతా మేల్కొంటారు. ఇది ఆకలి వల్ల కావచ్చు, రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించడం వల్ల కావచ్చు లేదా ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు లేకపోవడం వల్ల కావచ్చు.

    ప్రసవానంతర నిద్రలేమి ఉంటే.. ఆమెకు పగటిపూట కూడా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీనివల్ల పనులపై దృష్టి పెట్టడం లేదా శిశువుతో సంభాషించడం కష్టతరం అవుతుంది. ఉదయం మంచం నుండి లేవడానికి కూడా ఇబ్బంది పడవచ్చు లేదా దాని నుండి బయటపడటానికి పగటిపూట నిద్రపోవాలని అనిపించవచ్చు.

    ప్రసవానంతర నిద్రలేమికి చికిత్స

    కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) అనేది ఒక రకమైన మానసిక చికిత్స. ఇది ఎవరిలోనైనా ప్రతికూల ఆలోచన, ప్రవర్తన విధానాలను మార్చడంలో సహాయపడుతుంది. CBT అనేది నిద్రలేమితో సహా అనేక మానసిక ఆరోగ్య పరిస్థితులకు సమర్థవంతమైన చికిత్స.

    ప్రసవానంతర నిద్రలేమి కోసం తెరపిస్ట్ CBT చేసే సమయంలో.. నిద్రపోకుండా చేసే ఆలోచనలు, ప్రవర్తనలను గుర్తించి, మార్చడంలో సహాయం చేస్తాడు. CBT యొక్క లక్ష్యం ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను అలవాటు చేయడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం.

    CBTలో సాధారణంగా నిద్ర, విశ్రాంతి తీసుకొనేలా శిక్షణ, అభిజ్ఞా పునర్నిర్మాణం గురించిన విద్య ఉంటాయి. స్లీప్ ఎడ్యుకేషన్‌లో నిద్ర వల్ల కలిగే లాభాలు, సరైన నిద్ర అలవాట్ల యొక్క ప్రాముఖ్యత, సాధారణ నిద్ర సమస్యల గురించిన సమాచారం ఉండవచ్చు. రిలాక్సేషన్ శిక్షణలో కండరాలకు విశ్రాంతినివ్వడం లేదా శ్వాస నియంత్రణ వంటి పద్ధతులు ఉండవచ్చు.

    ప్రసవానంతర నిద్రలేమి నుండి ఉపశమనం కోసం చిట్కాలు

    ప్రసవానంతర నిద్రలేమి నుండి ఉపశమనం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి:

    1. నిద్రకు ఒక షెడ్యూల్‌ అలవాటు చేసుకోండి. వారాంతాల్లో కూడా ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకుని, మేల్కొనడానికి ప్రయత్నించండి. ఈ అలవాటు శరీరానికి సహజంగా నిద్రపోవడం మేల్కొనడం సరిగ్గా అలవాటయ్యేలా సహాయపడుతుంది.

    2. నిద్రకు ప్రశాంతమైన దినచర్యను తయారు చేసుకోండి. నిద్రించడానికి కొన్ని నిమిషాల ముందు, విశ్రాంతి కోసం వ్యాయామాలు చేయడం, విశ్రాంతి తీసుకోవడం లేదా పుస్తకాన్ని చదవడం మీ మనస్సును నిద్రకు సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.

    3. పడుకునే ముందు స్క్రీన్ చూడటం తగ్గించండి. నిద్రపోయే సమయాల్లో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే అవి విడుదల చేసే నీలి కాంతి సహజ సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగించి నిద్రపోవడం కష్టతరం చేస్తుంది.

    4. పగటిపూట వ్యాయామం చేయండి. ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిద్రవేళ దగ్గర పడుతున్నప్పుడు వ్యాయామం చేయడం మానుకోండి. ఎందుకంటే దీనివల్ల వ్యతిరేక ప్రభావం ఉంటుంది.

    5. సప్లిమెంట్ తీసుకోవడం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటికీ తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ఇబ్బందిపడుతుంటే.. మెలటోనిన్ వంటి సహజ సప్లిమెంట్ తీసుకోవడం గురించి వారి డాక్టర్‌తో మాట్లాడటం రాత్రిపూట నిద్రరావడానికి సహాయపడుతుంది.

    ముగింపు

    ఈ కథనాన్ని చదివిన తర్వాత, ప్రసవానంతర నిద్రలేమికి సంబంధించిన లక్షణాలు, చికిత్సలు, ఉపశమనాలకు సంబంధించిన చిట్కాల గురించి మీకు తెలిసి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత మీరు నిద్రలేమితో పోరాడుతుంటే.. మీరొక్కరే ఈ సమస్యతో బాధపడటం లేదని, వీటిలో కొన్ని విషయాలు సహాయపడతాయని తెలుసుకోండి. మీరు ఏమి చేయచ్చో డాక్టర్‌తో మాట్లాడాలని నిర్ధారించుకోండి, మీకు ఏది పనిచేస్తుందో చూడటానికి ఈ కథనంలోని కొన్ని చిట్కాలను ప్రయత్నించండి.

    కొత్తగా తల్లులైనవారు, పసిపిల్లలకు సంబంధించిన మరిన్ని విద్యా మార్గదర్శకాల కోసం మైలో ఫ్యామిలీని సందర్శించండి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.